Salt Tea Health Benefits: సాల్ట్​ టీ ఎప్పుడైనా తాగారా.. ప్రయోజనాలు పుష్కలం..!

Salt Tea Health Benefits: ప్రపంచంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ మాత్రమే.

Update: 2024-02-26 08:55 GMT

Salt Tea Health Benefits: సాల్ట్​ టీ ఎప్పుడైనా తాగారా.. ప్రయోజనాలు పుష్కలం..!

Salt Tea Health Benefits: ప్రపంచంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ మాత్రమే. కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తో రోజును ప్రారంభిస్తారు. మరికొంతమంది టీ తాగి రోజును ముగిస్తారు. అందుకే మనదేశంలో టీ షాప్​లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. నలుగురు ఒక సెంటర్​లో కలిసే వారు నెక్స్ట్​ చేసే పని టీ తాగడమే. అయితే టీలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పటివరకు గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ, జింజర్​ టీ లాంటి వాటి గురించి తెలిసి ఉంటుంది. కానీ సాల్ట్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా.. దీనిని ఎలా తయారుచేయాలి దీనివల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సాల్ట్​ టీ తయారుచేయడం అత్యంత సులువైన పని. నార్మల్​గా టీ చేసి అందులో కొద్దిగా సాల్ట్​ వేస్తే సరిపోతుంది. దీనివల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ మెరుగవుతుంది. కణజాలంలోకి పోషకాలు మరింత సులభంగా చేరుతాయి. సాల్ట్ టీ రక్తపోటు నియంత్రణకు, కడుపులో కావాల్సినంత జీర్ణరసం ఉత్పత్తికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్ల బెడద తప్పుతుంది. చలికాలం ముగుస్తున్న సమయంలో కనీసం రెండు సార్లు ఈ టీ తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

టీలో హిమాలయన్ లేదా పింక్ సాల్ట్ వేసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే జింక్‌తో కణజాలం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై పులిపిర్లు రాకుండా ఉంటాయి. మైగ్రేన్ సమస్యకు సాల్ట్ టీతో చెక్ పెట్టొచ్చు. శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది. లో బీపీ పేషెంట్లకు ఇది చాలాబాగా పనిచేస్తుంది. శరీరంలో హార్మోన్స్​ అసమతుల్యం కాకుండా చూస్తుంది. మనసుకు మంచి రిలాక్స్​ లభిస్తుంది. అయితే సాల్ట్​ టీ కొంతమందికి ఇష్టముండదు. ఎందుకంటే దీని రుచి వారికి నచ్చదు. కానీ అలవాటు పడితే శరీరానికి బోలెడు ప్రయోజనాలు లభిస్తాయని గుర్తుంచుకోండి. 

Tags:    

Similar News