Men Beauty Tips: 35 ఏళ్ల తర్వాత పురుషులు యవ్వనంగా కనిపించాలంటే..?

Men Beauty Tips: ఈ రోజుల్లో పురుషులు చాలా బిజీ. ఎందుకంటే కుటుంబ భారం మొత్తం వారిపైనే ఆధారపడి ఉంటుంది.

Update: 2022-06-22 07:30 GMT

Men Beauty Tips: 35 ఏళ్ల తర్వాత పురుషులు యవ్వనంగా కనిపించాలంటే..?

Men Beauty Tips: ఈ రోజుల్లో పురుషులు చాలా బిజీ. ఎందుకంటే కుటుంబ భారం మొత్తం వారిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వారి ఆరోగ్యం, అందం గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల వారి చర్మం తొందరగా ముడతలు పడుతోంది. ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత పురుషుల చర్మం అంద విహీనంగా తయారవుతంది. అలాంటి సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

1. ముఖాన్ని శుభ్రం చేసుకోండి

చర్మ సంరక్షణలో భాగంగా ఉదయం లేచిన వెంటనే మొదట ఫేస్‌వాష్ చేయాలి. చాలా సార్లు పురుషులు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోరు. దీని వల్ల చర్మం జిడ్డుగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో జిడ్డు చర్మాన్ని శుభ్రం చేయడానికి క్లెన్సర్ ఉపయోగించవచ్చు.

2. ముఖంపై సీరమ్ అప్లై చేయండి

35 ఏళ్ల తర్వాత చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోతే చర్మం వదులుగా మారుతుంది. ఈ పరిస్థితిలో చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ సీరమ్ వాడాలి.

3. చర్మాన్ని బాగా మాయిశ్చరైజ్ చేయాలి

ముఖం కడుక్కుని విటమిన్ సి ఉన్న సీరమ్‌ను అప్లై చేసిన తర్వాత తప్పనిసరిగా మర్దన చేయాలి. చర్మాన్ని తేమగా మార్చుకోవాలి. ఇది మీ చర్మం కాంతివంతంగా తయారుకావడానికి సహాయపడుతుంది. దీంతో పాటు మీ చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

4. ఆరోగ్యకరమైన జీవనశైలి

కొన్నిసార్లు చర్మం చెడిపోవడానికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలి కారణం అవుతుంది. 35 సంవత్సరాల తర్వాత పురుషులు వారి జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం మీరు పుష్కలంగా నీరు తాగాలి. ఇది చర్మాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Tags:    

Similar News