ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ.. నంబర్ వన్ ఎవరంటే ?

ICC ODI Rankings: ఒకవైపు టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. మరోవైపు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది.

Update: 2025-03-05 10:45 GMT

ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ.. నంబర్ వన్ ఎవరంటే ?

ICC ODI Rankings: ఒకవైపు టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. మరోవైపు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. టాప్ 10 బ్యాట్స్‌మెన్‌లలో నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. శుభ్‌మాన్ గిల్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారీ షాక్ ఎదుర్కొన్నారు. అతను రెండు స్థానాలు దిగజారి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. బాబర్ అజామ్ రెండవ స్థానంలో, హెన్రిచ్ క్లాసెన్ 3వ స్థానంలో ఉన్నాడు.

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ ఎందుకు ఇలా పడిపోయాడో తెలుసుకుందాం. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించలేకపోతున్నాడు.అతను వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయ్యాడు. అతను జట్టుకు విజయాలను అందించాడు కానీ స్వతహాగా పరుగులను సాధించడంతో విఫలమవుతూ వస్తూనే ఉన్నాడు. సెమీ-ఫైనల్‌లో కూడా ఓపెనింగ్ ఇచ్చినప్పటికీ రోహిత్ శర్మ 28 పరుగులకే అవుట్ అయ్యాడు.

రోహిత్ ఫెయిల్ అయ్యాడు కానీ ఈ ట్రోఫీలో విరాట్ మాత్రం వీర విహారం చేస్తున్నాడు. పాకిస్తాన్ పై సెంచరీ చేసిన తర్వాత సెమీ-ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై సెంచరీ కాస్తలో మిస్ అయ్యాడు. విరాట్ ఈ మ్యాచ్ లో 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ కారణంగానే టీం ఇండియా సెమీఫైనల్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. మరోవైపు, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన శుభ్‌మాన్ గిల్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు కానీ తన రేటింగ్ పాయింట్లు తగ్గాయి. ఇప్పుడు గిల్, బాబర్, విరాట్ స్కోర్‌ల మధ్య పెద్దగా తేడా లేదు. విరాట్ కోహ్లీ ఇలాగే ప్రదర్శన కొనసాగిస్తే తను శుభ్‌మాన్ గిల్‌కు సవాల్ విసరగలడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు సాధించిన శ్రేయాస్ అయ్యర్ కూడా ర్యాంకింగ్స్‌లో ముందుకు దూకాడు. అతడు 9వ స్థానం నుండి 8వ స్థానానికి చేరుకున్నాడు.

Tags:    

Similar News