ఆ చారు అంటే అందరికి ఇష్టమే.. కానీ రుచికరంగా ఉండాలంటే ఇలా చేయాలి..!

Update: 2020-03-13 05:30 GMT

ఏ కాలంలోనైనా పప్పు తోపాటు సమానంగా భుజించే వంటకం టమాట చారు.. చాలా మందికి ఈ వంటకం అంటే ఇష్టం. పప్పును కేవలం రైస్, చపాతీ లలో మాత్రమే ఎక్కువగా తీసుకుంటుంటారు.. కానీ టమాట కర్రీ.. అలాగే పలుచగా చేసే చారు మాత్రం అన్నింటీన్లో కలుపుకొని తింటారు. అయితే నార్మల్ గా కాకుండా టమాట చారును అత్యంత రుచికరంగా తయారు చేయాలనీ అనుకుంటున్నారా.. అయితే పదండి..

కావలసిన పదార్ధాలు :

*టమాటాలు

*నీళ్లు

*కరివేపాకు

*ఆవాలు

*జీలకర్ర

*మెంతులు

*ఇంగువ

*ఎండు మిర్చి

*వెల్లుల్లి రెబ్బలు

*పసుపు

*కొత్తిమీర

*బెల్లం పొడి

*చింతపండు గుజ్జు

తయారీ విధానం :

ముందుగా స్టవ్ వెలిగించాలి.. తరువాత గిన్నె పెట్టుకోవాలి..గిన్నె వేడి అయ్యాక పచ్చిసెనగ పప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.. ఇప్పుడు ఇందులోనే రెండు ఎండుమిర్చి, టీస్పూన్ జీలకర్ర , అరటీస్పూన్ మిరియాలు, పావుటీస్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ధనియాలు, వేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసి దింపేయాలి. ఇవి చల్లారాక మిక్సీ తీసుకుని అందులో వేసి పొడి తయారు చేసుకోవాలి...

ఇప్పుడు మరో గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో కాస్త నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులు ఇందులో వేసుకోవాలి...ఇవి చిటపటలాడాక ఎండు మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అరటీస్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు రెండు కరివేపాకు రెబ్బలని వలిచి ఇందులో వేసుకోవాలి.. ఇవి వేగాక ఇప్పుడు రెండు టమాటాలను తీసుకుని వాటిని గుజ్జుగా చేసుకోవాలి.. ఈ గుజ్జును గిన్నెలో వేసుకోవాలి.. ఉప్పు కూడా వేసుకోవాలి. టమాట ప్యూరీ బాగా మెత్తగా ఉడకనివ్వాలి.. ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలి.. ఇప్పుడు టీస్పూన్ అంత చింతపండు గుజ్జును ఇందులో వేసుకోవాలి.

ఇప్పుడు అరటేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి..బెల్లం పొడి లేకపోతే చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. వీటన్నింటిన బాగా కలుపుకోవాలి.. ఇప్పుడు రెండు గ్లాసుల నీరు పోసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు సిమ్‌లో మంటను పెట్ఉటకుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రసం పొడిని వేసుకోవాలి. ఇప్పడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కాసేపు మూత ఉంచి మరిగించాలి... అంతే టేస్టీ టమాట చారు రెడీ.

Tags:    

Similar News