యూరిక్ యాసిడ్ పెరిగితే గుండెపోటు వస్తుందా? నిపుణుల హెచ్చరికలు ఇదే!

మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గౌట్‌, కిడ్నీ రాళ్లు, కీళ్ల నొప్పి మాత్రమే కాకుండా రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. నిపుణులు చెబుతున్న వివరాలను ఇప్పుడు చూద్దాం.

Update: 2025-08-19 16:24 GMT

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?

ప్యూరిన్ అనే పదార్థం శరీరంలో కరిగినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. అయితే ఎక్కువగా ఉత్పత్తి కావడం లేదా శరీరం దాన్ని సరిగా బయటకు పంపకపోవడం వల్ల ఇది రక్తంలో పేరుకుపోతుంది.

యూరిక్ యాసిడ్ పెరిగితే వచ్చే సమస్యలు:

కీళ్ల నొప్పి (గౌట్‌): రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే సూదుల్లాంటి స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోతుంది. దీని వల్ల వాపు, నొప్పి వస్తాయి. ముఖ్యంగా కాలి బొటన వేళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది.

గుండె సమస్యలు: యూరిక్ యాసిడ్ అధికమైతే రక్తపోటు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఇది గుండెపోటు, పక్షవాతం, అసాధారణ గుండె వేగం వంటి సమస్యలకు దారితీస్తుంది.

కిడ్నీ రాళ్లు: అధిక యూరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి మూత్ర నాళాల్లో అడ్డుపడి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. కొన్నిసార్లు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులకు దారితీస్తాయి.

కనిపించే ముఖ్య లక్షణాలు:

బొటనవేలులో తీవ్రమైన నొప్పి, వాపు, ఎర్రబారడం (రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది)

కీళ్ల నొప్పి వల్ల నడవడంలో, నిలబడడంలో ఇబ్బంది

నడుము నొప్పి

పాదాల కింద మంట, తిమ్మిరి, వాపు

జాగ్రత్తలు:

ఇలాంటి లక్షణాలు కనపడగానే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. సరైన చికిత్స, ఆహారపు అలవాట్లలో మార్పులతో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించవచ్చు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, నిపుణులను సంప్రదించడం తప్పనిసరి.

Tags:    

Similar News