Dengue Symptoms: జ్వరంతో పాటు బీపీ పడిపోతుందా.. అయితే అది ఆ డేంజరస్ వ్యాధి కావచ్చు

Dengue Symptoms: ఒక వ్యక్తికి అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తే, దానితో పాటు బీపీ కూడా పడిపోతుంటే అది డెంగ్యూ సంకేతం కావచ్చు.

Update: 2025-05-10 07:18 GMT

Dengue Symptoms: జ్వరంతో పాటు బీపీ పడిపోతుందా.. అయితే అది ఆ డేంజరస్ వ్యాధి కావచ్చు

Dengue Symptoms: ఒక వ్యక్తికి అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తే, దానితో పాటు బీపీ కూడా పడిపోతుంటే అది డెంగ్యూ సంకేతం కావచ్చు. సాధారణంగా డెంగ్యూలో జ్వరం 102 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీనితో పాటు శరీరంలో బలహీనత, కళ్ళు తిరగడం, కళ్ళ వెనుక నొప్పి, ఒళ్ళు నొప్పులు, అలసటగా అనిపిస్తుంది. బీపీ 90/60 లేదా అంతకంటే తక్కువగా ఉంటే.. అది డెంగ్యూ తీవ్రమైన రూపాన్ని సూచిస్తుంది. దీనిని ‘డెంగ్యూ హెమోరేజిక్ ఫీవర్’ అంటారు.

డెంగ్యూ లక్షణాలను తేలికగా తీసుకోకండి

డెంగ్యూ ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ జ్వరం వలెనే ఉంటాయి. కానీ నెమ్మదిగా ఇది తీవ్రమైన రూపం దాల్చవచ్చు. తలనొప్పి, కీళ్ళు, కండరాలలో నొప్పి, వాంతులు, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కడుపు నొప్పి, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం దీని ప్రధాన సంకేతాలు. ఈ లక్షణాలతో పాటు బీపీ కూడా తగ్గుతుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

ఈ టెస్టులు చేయించుకోండి

డాక్టర్ డెంగ్యూ అని అనుమానిస్తే వారు కొన్ని ముఖ్యమైన టెస్టులు చేయించకోవాలని సూచిస్తారు. వాటిలో మొదటిది NS1 యాంటిజెన్ టెస్ట్, ఇది డెంగ్యూ ప్రారంభమైన 5 రోజుల్లో చేస్తారు. వైరస్‌ను నిర్ధారిస్తుంది. దీనితో పాటు CBC (కంప్లీట్ బ్లడ్ కౌంట్) చేయించుకోవడం చాలా ముఖ్యం. దీని ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య, శరీరంలో ఇన్ఫెక్షన్ స్థాయి తెలుస్తుంది.

డెంగ్యూ వచ్చిన కొన్ని రోజుల తర్వాత IgM, IgG యాంటీబాడీ పరీక్షలు చేస్తారు. దీని ద్వారా శరీరం వైరస్‌పై ఎంత రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసిందో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (LFT/KFT) కూడా చేయించుకుంటారు. ఎందుకంటే డెంగ్యూ ఈ అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు.

సమయానికి చికిత్స ముఖ్యం

వాస్తవానికి డెంగ్యూకు ప్రత్యేక చికిత్స లేదు.. కానీ సరైన సమయంలో లక్షణాలకు చికిత్స, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. రోగికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వడం, కొబ్బరి నీరు, నిమ్మరసం, జ్యూస్, ORS వంటి ద్రవాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ప్లేట్‌లెట్ల స్థాయిని నిరంతరం పర్యవేక్షించాలి. ఇది చాలా తక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఆసుపత్రిలో చేర్పించవలసి ఉంటుంది.

ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

డెంగ్యూ సమయంలో డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ మందులు తీసుకోకండి. ముఖ్యంగా నొప్పి నివారణ మందులు డైక్లోఫెనాక్. ఈ మందులు రక్తస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇంట్లో దోమలు కుట్టకుండా జాగ్రత్త పడండి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమతెరలను ఉపయోగించాలి.

Tags:    

Similar News