Women Health: మహిళల్లో గుండె జబ్బులు.. ఈ వయసు తర్వాత మరణాలు సంభవిస్తున్నాయి..!

Women Health: ఆధునిక కాలంలో గుండెపోటుతో చాలామంది మరణిస్తున్నారు. ఇందులో ఎక్కువగా చిన్న వయసువారు ఉండటం గమనార్హం. ముఖ్యంగా యువతలో గుండెపోటు కేసులు ఎక్కువగా వస్తున్నాయి.

Update: 2023-11-27 16:00 GMT

Women Health: మహిళల్లో గుండె జబ్బులు.. ఈ వయసు తర్వాత మరణాలు సంభవిస్తున్నాయి..!

Women Health: ఆధునిక కాలంలో గుండెపోటుతో చాలామంది మరణిస్తున్నారు. ఇందులో ఎక్కువగా చిన్న వయసువారు ఉండటం గమనార్హం. ముఖ్యంగా యువతలో గుండెపోటు కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే చాలామందికి మహిళల్లో గుండెపోటు కేసులు తక్కువగా ఉంటాయని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. చాలా పరిశోధనల్లో గుండెపోటు వల్ల మహిళల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తేలింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక క్యాన్సర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయని పేర్కొంది. ఇప్పుడు ఈ వ్యాధి ఏ వయసు వారినైనా బాధితులను చేస్తోంది. చాలా సందర్భాల్లో గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న పిల్లలు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

ప్రమాదంలో వృద్ధ మహిళలు

సాధారణంగా వృద్ధ మహిళలు గుండె జబ్బుల వల్ల ఎక్కువగా మరణిస్తున్నారు. గర్భధారణ సంబంధిత గుండె జబ్బుల విషయంలో కేవలం 1% మహిళలు మాత్రమే డాక్టర్ వద్దకు వెళుతున్నారు. అందుకే మరణాల రేటు ఎక్కువగా ఉంది. యువతీ యువకుల్లో గుండెజబ్బుల రేటు ఏటా పెరుగుతోందని మెడికల్ జర్నల్‌లోని పరిశోధనలో తేలింది. 1995, 2014 మధ్య 35 నుంచి 54 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో గుండెపోటు రేటు 21% నుంచి 31%కి పెరిగింది. తర్వాత ఏటా పెరుగుతూ వస్తోంది. ఈ రేటు పురుషుల కంటే కొంచెం తక్కువ. కానీ మహిళల్లోనూ గుండెపోటు కేసులు లేవని అర్థం కాదు.

మహిళల్లో గుండెపోటుకు కారకాలు

రక్తపోటు పెరుగుదల,

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు

మానసిక ఒత్తిడి, నిరాశ

చెడు ఆహారపు అలవాట్లు

చెడు జీవనశైలి

ధూమపానం, మద్యపానం

ఊబకాయం పెరగడం

జంక్ ఫుడ్ తినడం

అధిక రక్త చక్కెర

Tags:    

Similar News