Health: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే.. హార్ట్ ఎటాక్స్‌ని ముందే గుర్తించొచ్చు
Health: కాంటాలగా.. ఫేమ్ షఫాలీ ఇటీవల హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఆమె వయసు 42ఏళ్లు. ఆమె డ్యాన్స్ చేస్తారు. జిమ్ చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.
Health: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే.. హార్ట్ ఎటాక్స్‌ని ముందే గుర్తించొచ్చు
Health: కాంటాలగా.. ఫేమ్ షఫాలీ ఇటీవల హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఆమె వయసు 42ఏళ్లు. ఆమె డ్యాన్స్ చేస్తారు. జిమ్ చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. అయినా ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆమెకు గుండెలో నొప్పి రాగానే హాస్పిటల్‌కు తీసుకెళుతున్న మధ్యలోనే కన్నుమూశారు. ఇంత సడన్‌గా హార్ట్ ఎటాక్స్ వస్తాయా? ముందే దాన్ని పసిగట్టలేమా?
హార్ట్ ఎటాక్స్ అనేవి నిజంగా కొన్ని సార్లు సడన్‌గానే వస్తాయి. అలాంటి టైంలో ఎవరూ దాన్ని గుర్తించలేరు. కానీ ఎక్కువసార్లు గుర్తించే అవకాశం ఉంటుంది. కొన్ని లక్షణాలు ముందే గుండె నొప్పి వస్తుందని తెలియజేసాయి. అయితే వీటిని పట్టించుకోకుండా ఉన్నా.. నెగ్లిజెన్స్ చేసినా.. ఎటాక్స్ వచ్చేస్తాయి.
చెమటలు
హార్ట్ ఎటాక్స్ వస్తుందనగా అంటే కొన్ని గంటల ముందు ఒళ్లంతా ఒక్కసారిగా చెమట పడుతుంది. ఏసీ గదిలో ఉన్నా చెమట పడుతుంది. ఇలా చెమట పట్టిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించి ఈసీజీ తీయించుకోవాలి.
గుండెలో నొప్పి
గుండె ప్రాంతంలో లైట్‌గా పెయిన్ వస్తుంటుంది. అయితే ఇది చాలా మంది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటారు. గుండె పట్టినట్టు ఉండి, భుజం అంతా లాగుతుంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి. గుండెనొప్పి వచ్చి నప్పుడు ఎడమ పక్క భాగం అంతా బరువై పోతుంది. అలాగే ఒక్కోసారి అది కుడిపక్కన కూడా వస్తుంది.
అలసట
శరీరం బాగా అలసిపోతుంది. ఒక్కసారి ఎక్కడైనా కూర్చుండి పోదామా అని అనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పనులకీ నీరసం అయిపోతారు. ఎందుకంటే రక్తప్రసరణ ఆగిపోతుంటే ఇలానే ఉంటుంది. అందుకే ఇలా ఉన్నప్పుడు కూడా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
శ్వాస ఇబ్బంది
ఒక్కోసారి గుండె బరువైనప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. లోపల రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుది. ఇలా ఉంటే లేట్ చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి.
దడ
గుండె నొప్పి వచ్చే కొన్ని గంటల ముందు దడ పుడుతుంది. వణుకు వస్తుంది. శరీరమంతా ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
అంతేకాదు నిద్రపోతున్న సమయంలో కూడా అకస్మాతుగా మెలకువ రావడం జరుగుతుంది. అప్పుడు కూడా శరీరమంతా ఇబ్బంది కరంగా అన్ ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడు ఎడమ భుజం, గుండె ఉండే ప్రాంతంలో ఎలా ఉందో చూసుకుని వెంటనే డాక్టర్ ని సంప్రందించాలి. చాలామంది ఇలాంటి కనిపిస్తున్న సమయంలో విశ్రాంతి తీసుకోవడం లేదా సొంతవైద్యం చేసుకుంటారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు... ఇవన్నీ కూడా గుండె నొప్పి వచ్చే ముందు లక్షణాలే. కాబట్టి డాక్టర్‌ని కలసి చెక్ చేయించుకోవడం ఎంతో మంచిది.