Healthy Benefits : పడుకునే ముందు ఒక స్పూన్ తేనె.. చలికాలంలో మీకు ఇది ఒక రక్షణ కవచం
Healthy Benefits : చలికాలం వచ్చేసింది.. వణుకు పుట్టించే చలితో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా మనల్ని పలకరిస్తాయి.
Healthy Benefits : పడుకునే ముందు ఒక స్పూన్ తేనె.. చలికాలంలో మీకు ఇది ఒక రక్షణ కవచం
Healthy Benefits : చలికాలం వచ్చేసింది.. వణుకు పుట్టించే చలితో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా మనల్ని పలకరిస్తాయి. ఈ సీజన్‌లో మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో చిట్కాలు పాటిస్తుంటాం. అయితే మన వంటింట్లో ఉండే ఒకే ఒక్క పదార్థం ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టగలదని మీకు తెలుసా? అదే తేనె. రాత్రి పడుకునే ముందు కేవలం ఒక స్పూన్ తేనె తీసుకోవడం వల్ల కలిగే లాభాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. అది ఒక ఔషధంగా ఎలా పనిచేస్తుందో, ఎవరెవరు దీన్ని తీసుకోకూడదో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గాఢ నిద్ర మీ సొంతం: రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడేవారికి తేనె ఒక గొప్ప వరమని చెప్పాలి. తేనెలో ఉండే గ్లూకోజ్ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని స్వల్పంగా పెంచుతుంది. ఇది మన మెదడులో సెరోటోనిన్, మెలటోనిన్(నిద్రను కలిగించే హార్మోన్లు) ఉత్పత్తి కావడానికి సహాయపడుతుంది. పడుకునే ముందు ఒక స్పూన్ తేనె తింటే, ఒత్తిడి తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.
రోగనిరోధక శక్తికి బూస్ట్: తేనెలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి, జింక్ చలికాలంలో వచ్చే జ్వరం, జలుబు దరిచేరకుండా చూస్తాయి. గొంతులో గిలగిలమన్నా, దగ్గు వేధిస్తున్నా తేనె ఒక సహజ సిద్ధమైన సిరప్‌లా పనిచేసి ఉపశమనాన్ని ఇస్తుంది.
మెరిసే చర్మం - ఆరోగ్యకరమైన గుండె: చలికాలంలో చర్మం పొడిబారిపోవడం సహజం. తేనెలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచి, సహజమైన మెరుపును ఇస్తాయి. ఇది ముఖంపై ముడతలు రాకుండా కూడా కాపాడుతుంది. ఇక గుండె ఆరోగ్యం విషయానికి వస్తే.. తేనెలో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.
ఎవరు తీసుకోకూడదు? : తేనె ఆరోగ్యానికి మంచిదే అయినా, అందరికీ సెట్ కాదు. ఏడాది లోపు పిల్లలకు తేనెను అస్సలు ఇవ్వకూడదు (దీనివల్ల బోటులిజం వచ్చే ప్రమాదం ఉంది). అలాగే, డయాబెటిస్ ఉన్నవారు తేనెను చాలా జాగ్రత్తగా వాడాలి, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. తేనె వల్ల అలర్జీ వచ్చే వారు కూడా దీన్ని దూరం పెట్టడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.