Diabetes: పురుషులలో ఈ లక్షణాలు కనిపిస్తే మధుమేహం కావొచ్చు..!

Diabetes: పురుషులలో ఈ లక్షణాలు కనిపిస్తే మధుమేహం కావొచ్చు..!

Update: 2022-07-09 14:30 GMT

Diabetes:పురుషులలో ఈ లక్షణాలు కనిపిస్తే మధుమేహం కావొచ్చు..!

Diabetes: ఆధునిక కాలంలో జీవనశైలి సరిగ్గా లేనందున చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో లేనప్పుడు మధుమేహం సమస్య వస్తుందని అందరికి తెలిసిందే. అయితే మధుమేహం కారణంగా శరీరంలో అనేక ఇతర సమస్యలు ఉండవచ్చు, ముఖ్యంగా పురుషులలో షుగర్ స్థాయి పెరిగినప్పుడు శరీరం ఎలాంటి సంకేతాలను ఇస్తుందో తెలుసుకుందాం.

శరీరంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు బాగా అలసిపోతారు. సాధారణంగా మధుమేహంతో బాధపడే రోగి మళ్లీ మళ్లీ మూత్ర విసర్జన సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయి పెరగడం వల్ల గాయాలు, కురుపులతో సమస్యలు ఉంటాయి. త్వరగా నయం కావు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

డయాబెటిస్‌ ఉన్నప్పుడు ఆకస్మికంగా బరువు తగ్గుతారు. మధుమేహం సమస్య తర్వాత మంచి ఆహారం తీసుకున్నప్పటికీ వేగంగా బరువు తగ్గుతారు. మధుమేహం శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కాబట్టి మీరు కూడా సడన్ గా బరువు తగ్గినట్లనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే రోగికి తరచుగా కడుపు నొప్పి సమస్య ఉంటుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. మీరు నొప్పితో బాధపడుతుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

Tags:    

Similar News