Health Myths: పెరుగన్నంతో చేప.. పొట్లకాయతో గుడ్డు కలిపి తింటే నిజంగా హానికరమేనా?

"పెరుగన్నం తింటూ చేప వడ్డించుకోవడం ఏమిట్రా బుర్రలేనివాడా" అని అమ్మ గద్దిస్తుంటుంది. "పొట్లకాయతో గుడ్డు కలిపి తిన్నావా? ఇక అంతే" అని పక్కింటి ఆంటీ భయపెడుతుంటుంది. కానీ నిజంగా ఈ కలయికలు శరీరానికి హానికరమా?

Update: 2025-08-31 06:30 GMT

నిపుణుల చెబుతున్న సమాధానం మాత్రం భిన్నంగా ఉంటుంది. ఏ ఆహారాన్ని మరో ఆహారంతో కలిపి తినకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. దీన్ని సమర్థించే శాస్త్రీయ ఆధారాలు లేవు.

అయితే, కొందరికి సహజంగానే కొన్ని ఆహారాలు నప్పకపోవచ్చు. ఉదాహరణకు గోంగూర, వంకాయ తిన్నప్పుడు దురదలు రావడం, లేదా కొన్ని రకాల నట్స్‌ తిన్నప్పుడు అలర్జీలు రావడం జరుగుతాయి. అలాంటప్పుడు మాత్రం ఆ పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి.

ఇక శస్త్రచికిత్సలు చేసిన తర్వాత పప్పులు తినకూడదన్నది కూడా అపోహే. నిజానికి ఆ సమయంలో శరీరానికి ప్రోటీన్‌ అత్యంత అవసరం. కాబట్టి శరీరానికి నప్పే ఆహారాలను ఎప్పుడైనా తీసుకోవచ్చు. నప్పని పదార్థాలను మాత్రం ఎప్పటికీ దూరంగా ఉంచుకోవాలి.

Tags:    

Similar News