Sweet Potatoes Benefits: క్యాన్సర్ తో పోరాడే చిలకడ దుంప

Sweet Potato Health Benefits: చిలకడ దుంపల్లోని యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలిది.

Update: 2021-06-29 05:48 GMT

Sweet Potato: (File Image)

Sweet Potatoes Benefits: వర్షాకాలం ప్రారంభం కాగా మనకు మార్కెట్లలో దర్శనమిస్తూ వుంటాయి చిలకడ దుంపలు. వీటి ధర అందరికీ అందుబాటులో వుంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు వీటి గురించి చెప్పనవసరం లేదు. వర్షా కాలంలో చాలా సాధారణమైన జలుబు, ఫ్లూ పై శరీరం పోరాడడానికి ఇది సహాయపడుతుంది. ఈ శాకాహారి మన శరీరంలో క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే శక్తి దీనికి వుంది. ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మన 'లైఫ్ స్టైల్' లో తెలుసుకుందాం.

  • భూమిలో పెరిగే చిలకడ దుంపలు నిండా పోషకాలే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ A, C, మాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్ (రాగి), నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి.
  • చిలకడ దుంపల్లోని యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలిది. కొన్ని రణాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. వీలైతే చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి. ఎందుకంటే ఆ తొక్కలో కూడా కాన్సర్‌ను అడ్డుకునే గుణాలు ఉన్నట్లు గుర్తించారు.
  • ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. చిలకడ దుంపల్లో అది బోలెడంత ఉంటుంది. వీటిలోని విటమిన్ ఏ... వ్యాధినిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
  • మధుమేహం కలవారికి చిలగడ దుంపలు ఒక వరం లాంటివి, ఇవి అధిక బ్లడ్ షుగర్ విరుగుడుకు కారణం కావు. కాబట్టి మధుమేహం కలవారు మామూలు దుంపలు తీసుకోవడానికి బదులుగా ఈ చిలగడ దుంపలకు తీసుకోవడం మంచిది.
  • చిలగడ దుంపలలో ఉండే అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్ క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇవి మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.
  • ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి... పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి.
  • ఈ దుంపల్లో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లలో కాంతిని గ్రహించే రిసెప్టర్లు తయారయ్యేలా చేస్తుంది. దాని వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఈ కాలంలో విరివిగా దొరికే చిలకడ దుంపలను మన ఆహారంలో భాగం చేసుకుందాం.
Tags:    

Similar News