ఆరోగ్యకరమైన ప్రోటీన్లు అందులో కూడా ఎక్కువ స్థాయిలో

Update: 2020-03-12 04:07 GMT

భారత్‌లో తయారు చేసే ఎన్నో వంటకాల్లో శనగపిండి ప్రధాన పదార్ధం. ఈ శనగపిండితో వివిధ రకాల పిండి వంటలు, స్వీట్స్‌, తయారు చేయడంతో పాటు కూరల్లో కూడా శనగపిండిని వినియోగిస్తుంటారు. చాలా మందికి శనగపిండితో చేసిన లడ్డూలు, మైసూర్‌పాక్‌లు...ఇలా ఎన్నో స్వీట్స్‌ అంటే చాలా ఇష్టం. వేయించిన శనగపప్పును పిండి చేయడం వల్ల శనగపిండి వస్తుంది. ఈ శనగపిండిలో ఎన్నో కార్బోహైడ్రేట్ల శాతం అధికంగా ఉంటుంది. ఇందులో పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కూడా ఇందులో ఎక్కువ స్థాయిలో లభిస్తాయి.

కేవలం వంటల్లో మాత్రమే కాదు..శనగపిండి చర్మ సౌందర్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. సాధారణంగా చాలా మంది యువతులు అందమైన ముఖ సౌందర్యాన్ని చర్మ సౌందర్యాన్ని పొందేందకు ఫేస్‌ప్యాక్‌లు అంటూ పార్లర్ల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు..వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు..కానీ వంటింట్లో లభించే సహజ సిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ శనగపిండితో చేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఎలాంటి చర్మ సమస్యలైనా సరే శనగపిండి స్వస్తి చెబుతుంది.

అసలే ఎండలు మండుతున్నాయి... ఎండలో ఎక్కువ సమయం తిరగడం వల్ల ముఖంతో మొదలుకుని చేతులు, మెడ మొత్తం నల్లబడుతుంది. తిరిగి చర్మ నిగారింపును సొంతం చేసుకోవాలంటే శనగపిండి ప్యాక్ చక్కటి ఫేస్‌ప్యాక్‌ గా పనిచేస్తుంది. రెండు స్పూన్‌ల శనగపిండిలో చిటికెడు పసుపు , అరస్పూన్ నిమ్మరసం, స్పూన్ పెరుగు వేసుకుని పేస్టులా తయారుచేసుకుని దాన్ని ముఖం , మెడ, చేతులకు పట్టించాలి...అరగంట తరువాత కడిగివేయాలి..ఇలా చేయడం వల్ల మంఇ ఫలితం దక్కుతుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు ప్యాక్ వేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. చర్మంపైన ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.

శనగపిండిని అన్ని రకాల చర్మాలకు వాడుకోవచ్చు. చర్మం పొడివారడం వంటి సమస్యలు ఉన్న వారు శనగపిండిలో కాస్త తేనె వేసి కాస్త పసుపు, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. మొటిమలు వంటి సమస్యలతో ఇబ్బందులు పడే వారు పసుపు, పాలు, శనగపిండిలో వేసి దానిని ముఖానికి రాసుకుంటే జిడ్డు సమస్య తీరుతుంది. ముఖంపై రంద్రాలు ఉన్నా, మచ్చలు ఏర్పడినా, వలయాలు ఉన్నా శనగపిండితో మటుమాయం అవుతాయి. 

Tags:    

Similar News