Tea Tips: టీని మళ్ళీ వేడి చేస్తున్నారా? మీ లివర్‌కు మీరే సమాధి కట్టుకుంటున్నారా? జాగ్రత్త బాసూ!

చాలామందికి ఉదయాన్నే వేడివేడి టీ తాగనిదే రోజు గడవదు. టీ అనేది కేవలం పానీయం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. అయితే, చల్లారిపోయిన టీని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తాగే అలవాటు మీకు ఉందా?

Update: 2025-12-26 03:50 GMT

Tea Tips: టీని మళ్ళీ వేడి చేస్తున్నారా? మీ లివర్‌కు మీరే సమాధి కట్టుకుంటున్నారా? జాగ్రత్త బాసూ!

 Tea Tips: చాలామందికి ఉదయాన్నే వేడివేడి టీ తాగనిదే రోజు గడవదు. టీ అనేది కేవలం పానీయం మాత్రమే కాదు, అదొక ఎమోషన్. అయితే, చల్లారిపోయిన టీని మళ్ళీ మళ్ళీ వేడి చేసి తాగే అలవాటు మీకు ఉందా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీని తయారు చేసిన 15 నుంచి 20 నిమిషాల లోపు తాగేయాలి. అంతకంటే ఎక్కువ సమయం గడిచినా లేదా దానిని మళ్ళీ వేడి చేసినా అది విషంతో సమానమని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల కాలేయం, జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.

టీని తయారు చేసి అలా పక్కన పెడితే, అది బ్యాక్టీరియా పెరగడానికి నిలయంగా మారుతుంది. ముఖ్యంగా జపాన్, చైనా వంటి దేశాల్లో నిల్వ ఉంచిన టీని పాము కాటు కంటే ప్రమాదకరమైనదిగా భావిస్తారు. జపాన్ ప్రజల నమ్మకం ప్రకారం.. 24 గంటల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన టీని తాగడం వల్ల శరీరంలో తీవ్రమైన విషపూరిత ప్రభావాలు ఏర్పడతాయి. అందుకే అక్కడ టీని ఎప్పటికప్పుడు తాజాగా చేసుకుని మాత్రమే తాగుతారు. టీ ఆకులను మళ్ళీ మళ్ళీ మరిగించడం వల్ల అందులోని టానిన్లు అనే కెమికల్స్ విడుదలయ్యి రుచిని చేదుగా మార్చడమే కాకుండా పొట్టలో మంటను కలిగిస్తాయి.

ముఖ్యంగా పాలు కలిపిన టీ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలు త్వరగా పాడైపోయే గుణం కలిగి ఉంటాయి. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పాలు కలిపిన టీని రెండు గంటల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. ఒకవేళ ఫ్రిజ్‌లో పెట్టినా, దానిని మళ్ళీ వేడి చేయడం వల్ల అందులోని పోషక విలువలు పూర్తిగా నశించిపోతాయి. ఇలా వేడి చేసిన టీ తాగడం వల్ల శరీరంలో ఎసిడిటీ లెవల్స్ పెరిగి, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. పదే పదే మరిగించడం వల్ల టీలోని ప్రోటీన్లు కూడా దెబ్బతింటాయి.

అల్లం టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని కూడా పరిమితంగానే తీసుకోవాలి. పాలు కలపని అల్లం టీని ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది, కానీ తాగే ముందు దానిని మరిగించడం అంత మంచిది కాదు. రోజుకు 4 నుంచి 5 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకుంటే కొంతమందిలో ఛాతిలో మంట వస్తుంది. అలాగే టీ రంగు మారినా లేదా వాసన వస్తున్నా దానిని వెంటనే పారేయాలి. తాజా టీ మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తించుకోవాలి.

ఆయుర్వేదం ప్రకారం కూడా నిల్వ ఉంచిన లేదా మళ్ళీ వేడి చేసిన టీ శరీరంలో విషతుల్య పదార్థాలు ఉత్పత్తి చేస్తుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. టీని పదే పదే వేడి చేయడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పోయి, కేవలం కెఫీన్ ప్రభావం మాత్రమే మిగులుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం, నిద్రలేమి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, టీ తాగాలనిపించిన ప్రతిసారీ కొద్ది మొత్తంలో తాజాగా తయారు చేసుకుని తాగడమే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష.

Tags:    

Similar News