Winter Skin Problems: చలికాలం చర్మం పొడిగా మారుతుందా.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్లే..!

Winter Skin Problems: వయస్సు పెరిగేకొద్దీ చర్మం గ్లో తగ్గుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం నిర్జీవంగా మారడం ఎక్కువవుతుంది.

Update: 2023-11-17 01:30 GMT

Winter Skin Problems: చలికాలం చర్మం పొడిగా మారుతుందా.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్లే..!

Winter Skin Problems: వయస్సు పెరిగేకొద్దీ చర్మం గ్లో తగ్గుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం నిర్జీవంగా మారడం ఎక్కువవుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం. కొన్నిసార్లు నిద్ర లేకపోవడం వల్ల చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఆహారంలో విటమిన్లు లేకపోవడం వల్ల చర్మం గ్లో తగ్గుతుంది. చర్మాన్ని అందంగా కనిపించేలా చేసే అనేక విటమిన్లు ఉన్నాయి. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఎలాంటి విటమిన్లు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

విటమిన్ కె

చర్మ కాంతిని పెంచడానికి విటమిన్ కె ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పిగ్మెంటేషన్ సమస్యను దూరం అవుతుంది. క్యాబేజీ, బ్రోకలీ, కొత్తిమీర, ఓట్ మీల్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

విటమిన్ ఇ

చలికాలంలో చర్మం మెరుపు తగ్గితే విటమిన్ ఇని డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే విటమిన్ ఇలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వేరుశెనగలో ఎక్కువగా లభిస్తుంది. ఆవాలు,బ్రోకలీలో ఉంటుంది. ఇది చర్మం పొడిబారడం, చికాకు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదే సమయంలో చర్మం మెరిసేలా చేస్తుంది.

విటమిన్ సి

విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ చర్మం పొడిగా, నిర్జీవంగా మారినట్లయితే ప్రతిరోజు నారింజ, నిమ్మ వంటి వాటిని తీసుకోవడం ప్రారంభించాలి. మంచి గ్లో వస్తుంది. అందంగా కనిపిస్తారు.

Tags:    

Similar News