Beauty Tips: ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా.. ఐస్‌ క్యూబ్స్‌ ఇలా వాడితే మెరిసే నిగారింపు మీ సొంతం..!

Beauty Tips: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు.

Update: 2024-05-06 15:30 GMT

Beauty Tips: ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా.. ఐస్‌ క్యూబ్స్‌ ఇలా వాడితే మెరిసే నిగారింపు మీ సొంతం..!

Beauty Tips: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరైతే మార్కెట్లో కొత్తగా వచ్చిన బ్యూటీ ప్రొడక్ట్స్‌ని అన్నింటినీ వాడుతుంటారు. ఇక ఎండాకాలం బయట తిరగడం వల్ల చాలామంది ముఖం జిడ్డుగా మారుతుంది. ఇలాంటి వారు ఎంత ట్రై చేసినా ముఖంలో గ్లో తీసుకురాలేకపోతారు. దీంతో ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లలేక ఇంట్లోనే ఉంటారు. ఇలాంటి వారికి ఇంట్లో లభించే ఐస్ క్యూబ్స్ ఎంతో మేలు చేస్తాయి. మీరు కోల్పోయిన నిగారింపును మళ్లీ తీసుకొస్తాయి. ఈ రోజు ఐస్‌ క్యూబ్స్‌ ఫేషియల్ గురించి తెలుసుకుందాం.

ముందుగా ఒక పాత్ర నిండా ఐస్ వాటర్ ని తీసుకోవాలి. అందులోనే కొద్దిగా ఐస్ ముక్కలను వేయాలి. ఇప్పుడు ఆ పాత్రలో ముఖాన్ని అంతా ముంచాలి. నిజానికి అన్నీ రకాల చర్మాలు ఆ చల్లదనాన్ని తట్టుకోలేవు. ఇలాంటి సమయంలో కొన్ని ఐస్ ముక్కలను ఓ క్లాత్ లో చుట్టి ముఖంపై కాసేపు మర్దనా చేసుకోవాలి. దీన్నే ఐస్ ఫేషియల్ అంటారు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫేస్ ఫ్రెష్ గా తయారవుతుంది. ఒక్కసారి చేస్తే చేంజ్ అర్దం అయిపోతుంది. సెలబ్రిటీలు సైతం ఎక్కువగా ఈ ఐస్ ఫేషియల్ చేయించునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నిజానికి ఐస్ క్యూబ్స్ ఫేస్ కి చాలా మంచి చేస్తాయి.

ఐస్ ముక్కలతో ఇలా చేయడం వల్ల ఫేస్ వేడి తగ్గుతుంది. ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేసుకోవడం వల్ల శరీరంలో వచ్చే నొప్పి, మంట తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది. దీని వల్ల ఫేస్ లో ఒకలాంటి గ్లో వస్తుంది. పింపుల్స్ తో బాధ పడేవారు సైతం ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. దీని వల్ల మొటిమలు తగ్గే అవకాశం ఉంది. వాటి వల్ల వచ్చే వాపు తగ్గుతుంది. ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతా యి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐస్ ఫేషియల్ ని చేసుకోవడం వల్ల ప్రశాంతం గా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Tags:    

Similar News