ఇంట్లో దొరికే ఈ మూలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు దివ్య ఔషధం..

ఇంట్లో దొరికే ఈ మూలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు దివ్య ఔషధం..

Update: 2022-01-06 03:00 GMT

ఇంట్లో దొరికే ఈ మూలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు దివ్య ఔషధం..

Ginger Benfits: ఇంట్లో మనం ప్రతి కూరలో వేసే అల్లంలో ఎన్నో దివ్య గుణాలు దాగి ఉన్నాయి. అందుకే సనాతన ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడుతారు. మందుల తయారీలో ఉపయోగిస్తారు. అల్లం ఒక కూరగాయ కాదు ఇది ఒక మూలికా. అద్భుత ఔషధాల గని అని చెప్పవచ్చు. అల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వివిధ ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది. రుచి కొంచెం ఘాటుగా, చేదుగా అనిపించవచ్చు కానీ ఎన్నో రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉంది.

వాస్తవానికి సంప్రదాయక ఆహారంలో తినే ఆహరాలన్ని శరీరాన్ని సహజంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. నేటికి ప్రపంచ జనాభాలో 42 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మధుమేహం తర్వాత రెండో అతిపెద్ద వ్యాధి ఫ్యాటి లివర్‌ అని పేర్కొంది. అల్లం కాలేయం, మూత్రపిండాలు రెండింటికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. అల్లంలోని సహజ గుణాలు కాలేయం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సహజంగా కరిగించి తగ్గిస్తాయి.

అల్లం తీసుకోవడం ఫ్యాటీ లివర్‌కు నివారణ అయితే భారతీయులకు ఫ్యాటీ లివర్ సమస్య ఉండదని అనుకుంటారు కానీ ఇది తప్పు. ఎందుకంటే అల్లం మన ప్రతి భోజనంలో అంతర్భాగం. మనం తినే ఆహారంలో అల్లం ఎల్లప్పుడూ ఎక్కువ లేదా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కానీ మీరు తీసుకునే ఆహారం సహజమైన ఆహారం కాదు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఫ్యాటీ లివర్‌కు అతిపెద్ద కారణం అవుతుంది. మీరు తినే ఇలాంటి చెడ్డ ఆహారం వల్ల మీరు ప్రతిరోజూ అల్లం తిన్నప్పటికీ మీ వ్యాధి నయం కాదు. అందుకే అల్లంతో పాటు జీవన శైలి కూడా మార్చాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. 

Tags:    

Similar News