Cut Onion: ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ల నుంచి నీరు కారుతుందా.. ఇలా చేయండి..!

Cut Onion: ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ల నుంచి నీరు కారుతుందా.. ఇలా చేయండి..!

Update: 2022-02-22 06:00 GMT

Cut Onion: ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ల నుంచి నీరు కారుతుందా.. ఇలా చేయండి..!

Cut Onion: ఉల్లిపాయలు తింటే ఎంత రుచిగా ఉంటాయో కోసేటప్పుడు అంత ఘాటుగా ఉంటాయి. అయితే, వంటలు రుచిగా ఉండాలంటే ఉల్లిపాయ తప్పనిసరి. కానీ ఉల్లిపాయలు కోయడానికి మాత్రం ఎవ్వరు ముందుకు రారు. నిజానికి ఉల్లిపాయల్లో ఉండే ఎంజైమ్‌ల వల్ల మన కళ్ల నుంచి నీళ్లు కారుతాయన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవాల్సిన పనిలేదు. ఎందుకంటే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

ఉల్లిపాయను కోసే ముందు వాటిని వెనిగర్‌లో కాసేపు ఉంచితే కోసేటప్పుడు కళ్ల నుంచి నీళ్లు రావు. ఇది కాకుండా కత్తిరించే ముందు 2 లేదా మూడు గంటల పాటు ఉల్లిపాయను ఫ్రీజర్‌లో ఉంచండి. అప్పుడు ఉల్లిపాయ నుంచి విడుదలయ్యే ఎంజైమ్ తక్కువ పరిమాణంలో బయటకు వస్తుంది. అప్పుడు ఉల్లిపాయ కట్ చేస్తే కళ్ల నుంచి నీళ్లు కారవు. ఇంకో విషయం ఏంటంటే ఉల్లిపాయను కత్తిరించేటప్పుడు పై భాగం నుంచి కాకుండా కింది నుంచి కట్‌ చేయాలి.

అంతేకాకుండా పదునైన కత్తిని వాడాలి. తద్వారా ఉల్లిపాయ త్వరగా కట్‌ అవుతుంది. కళ్ల నుంచి నీరు తక్కువగా వస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో సులువుగా లభించే కాయ నిమ్మకాయ. ఉల్లిపాయలు కోసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. మీరు ఉల్లిపాయను కత్తిరించే కత్తిపై కొద్దిగా నిమ్మరసం వేయాలి. ఇలా చేయడం వల్ల మీ కళ్ల నుంచి నీళ్లు కారవు. ఉల్లిపాయలు కోసేటప్పుడు రొట్టె ముక్కను నోటిలో పెట్టుకుని నమిలినా కన్నీళ్లు రావు.

Tags:    

Similar News