Weight Loss: ఈ 4 అలవాట్లు పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు.. ఎలాగంటే..?

Weight Loss: ఈ 4 అలవాట్లు పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు.. ఎలాగంటే..?

Update: 2022-01-30 15:30 GMT

Weight Loss: ఈ 4 అలవాట్లు పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు.. ఎలాగంటే..?

Weight Loss: బరువు పెంచుకోవడం చాలా సులువు కానీ తగ్గించుకోవాలంటే నానా తంటాలు పడాలి. ఈ విషయం ఇప్పటికే చాలామందిలో రుజువైంది. అయినప్పటికీ బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కరోనా వల్ల అందరు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో ఇంట్లో గంటల తరబడి కూర్చోవడంతో విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అంతేకాదు కొంతమంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రోజు వారీ అలవాట్లను సరిగ్గా పాటించకపోవడం వల్లే బరువు పెరుగుతున్నారు. ఈ రోజు బరువు తగ్గడానికి అలాంటి నాలుగు మంచి అలవాట్ల గురించి తెలుసుకుందాం. 

1. సరైన నిద్ర నిద్ర సరిగ్గా లేకుంటే తెలియకుండానే చాలామంది ఎక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల కేలరీలు ఖర్చుకాకుండా ఉండటంతో విపరీతంగా బరువు పెరుగుతారు. అందుకే ప్రతిరోజు కనీసం 8 గంటలు పడుకోవాలి. దీనివల్ల శరీరంలో ఉండే అనవసరమైన కేలరీలను తగ్గించుకోవచ్చు. 

2. బరువు ఎంతో తెలుసుకోండి మనలో చాలా మంది బరువును స్వయంగా తెలుసుకోవడానికి భయపడతారు. అయితే ఇది బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజూ బరువు కొలవడం వల్ల మీరు బరువు తగ్గడానికి విపరీతంగా ప్రయత్నిస్తారు. ఇది మంచి పలితాలను ఇస్తుంది. ఆహారంపై నియంత్రణ ఉంటుంది. రోజు రోజుకు మెరుగుపడుతారు. 

3. నీరు తాగడం నీరు తీసుకోవడం బరువు తగ్గడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల మీ జీవక్రియ రేటు పెరుగుతుంది. అంతేకాకుండా కడుపు నిండుగా ఉండటంతో ఎక్కువ ఆహారం తీసుకోరు. ఒకటి లేదా రెండు గ్లాసుల నీటితో మీ రోజును ప్రారంభించండి. రోజంతా నీరు తాగుతూనే ఉండండి. బరువు తగ్గడానికి ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. 

4. ఆహారాన్ని మెత్తగా నమిలి తినండి మీరు భోజనానికి కూర్చున్నప్పుడల్లా ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినండి. దీంతో ఎంత తింటున్నారో తెలుసుకుంటారు. నిదానంగా తినడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. టీవీ చూస్తూ, మ్యూజిక్‌ వింటూ ఎప్పుడు తినకూడదు. ఎందుకంటే అవసరం ఉండేదానికంటే ఎక్కువగా తినే అవకాశాలు ఉంటాయి.

Tags:    

Similar News