Health: వేసవిలో అవిసె గింజలు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి.
Health: వేసవిలో అవిసె గింజలు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా.?
హెల్త్: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో సహజ పరిష్కారంగా అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. చిన్నవిగా కనిపించినా, అవిసె గింజలు పోషక విలువలతో నిండినవి. వేసవిలో అవిసె గింజలను తీసుకుంటే జరిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- వేసవిలో శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచుకోవడం ఎంతో అవసరం. అవిసె గింజలు ఈ అవసరాన్ని బాగా తీర్చగలవు. పెరుగులో అవిసె గింజల పొడి లేదా నీటిలో నానబెట్టిన గింజలను కలిపి తీసుకుంటే శరీరానికి చల్లదనాన్ని కలిగించి, శక్తిని ఇస్తుంది.
- వేసవిలో ఎక్కువగా చెమట వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు శరీర తేమను నిలుపుకునేందుకు సహాయపడతాయి. రోజువారీగా అవిసె గింజల వినియోగం డీహైడ్రేషన్‌ను నివారించడంలో బాగా సహకరిస్తుంది.
- వేసవిలో చర్మం పొడిగా మారడం, జుట్టు మృదువుగా లేకపోవడం అనేది సాధారణం. అయితే, అవిసె గింజల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మానికి తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టుకు మృదుత్వం, మెరుపు చేకూరుస్తాయి. అవిసె గింజల పొడిని ఆహారంలో కలిపి తీసుకోవడం లేదా నూనె రూపంలో వినియోగించడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు.
- వేసవిలో కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు అధికంగా ఉంటాయి. అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. పెరుగుతో కలిపి తినడం ద్వారా ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
- వేసవిలో ఫిట్‌గా ఉండాలనుకునే వారికి అవిసె గింజలు ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పొచ్చు. ఇవి ఆకలిని తగ్గించి అధికంగా తినకుండా కాపాడుతాయి. దీంతో బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా శక్తిని కూడా అందిస్తాయి.