Fish Fry: చేప ఇలా వండుకొని తింటే గుండెకు ఎంతో మంచిది తెలుసా?

Fish Recipe Benefits: చేపలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే ఆదివారం వచ్చిందంటే చాలు మటన్, చికెన్ తినేవాళ్ళు ఎక్కువగానే ఉంటారు. చేప కూడా తినే వాళ్ళు ఉంటారు. అయితే చేపను సరైన పద్ధతిలో వండితే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Update: 2025-03-16 09:01 GMT

Fish Fry: చేప ఇలా వండుకొని తింటే గుండెకు ఎంతో మంచిది తెలుసా?

Fish Recipe Benefits: ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ తినే వాళ్ళు కచ్చితంగా చికెన్‌, మటన్‌ లేదా చేపలు తింటారు. అయితే బర్డ్‌ఫ్లూ కారణంగా చికెన్ తక్కువగా తింటున్నారు. మరికొంతమంది దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మటన్, చేపలకి గిరాకీ బాగా పెరిగింది. అయితే చేప ఆరోగ్యకరమైన నిపుణులు చెబుతారు. ఇది గుండెకు మంచిది. మెదడు పనితీరును కూడా మేలు చేస్తుంది. అయితే, చేపను ఇష్టానుసారంగా కాకుండా ఒక పద్ధతిలో వండితే అందులోని పోషకాలు మన శరీరానికి అందుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది

చేప గుండెతోపాటు మెదడు కూడా మంచిది. ఇది మన శరీరా ఆరోగ్యానికి బూస్టింగ్ ఇస్తుంది. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. ఓమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ తీసుకోవడం వల్ల గుండె ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు ఇవి ట్రైగ్లైసెరాయిడ్స్‌ కూడా తగ్గిస్తుంది.

చేపను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మంట, నొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గించి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగు చేస్తుంది.

చేప తీసుకోవడం వల్ల ఇది మెదడు అభిజ్ఞ పనితీరును కూడా మెరుగు చేస్తుంది. ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి తరచూ తీసుకోవటం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి కూడా బయటపడతారు. ఆస్తమాతో బాధపడుతున్న వారు చేప తీసుకోవాలి. ఇది అటాక్ కి గురికాకుండా కాపాడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి. మంచి కంటి చూపును మెరుగు చేస్తుంది. ఇంకా చేపల్లో జింక్‌, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.ఇవి నిద్రలేమి సమస్య కూడా మంచివి.

అయితే చికెన్, మటన్ లాగా చేపను ఎక్కువ సమయం పాటు ఉడికిస్తే ఇందులోనే పోషకాలు కోల్పోతారు. ఇలా కాకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో వండితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చేప తినేటప్పుడు మాంసాన్ని మానేయడం కూడా ఎంతో మంచిది. లేకపోతే రెండు కలిస్తే క్యాలరీలు అధికమవుతాయి. చేప వండేటప్పుడు మాత్రం గ్రిల్లింగ్ చేస్తే సరిపోతుంది. చిన్న మంటపై వండటం అలవాటు చేసుకోవాలి. లేకపోతే మైక్రో వేవ్ ఓవెన్ లో సింపుల్‌గా వండుకోవచ్చు. చేపలో నూనె శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువ నూనె ఉపయోగించండి. ఇది కాకుండా ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించే చేప కూర చేసుకుంటే రుచి అదిరిపోవడమే కాదు ఆరోగ్యమే ఆరోగ్యం..

Tags:    

Similar News