Fatty Liver Problem: మీరు మద్యం తాగకున్నా ఫ్యాటి లివర్‌ సమస్య వస్తుంది.. కారణం ఏంటంటే..?

Fatty Liver Problem: ఈ రోజుల్లో చాలామంది లివర్‌ సమస్యల బారిన పడుతున్నారు. దీనికి కారణం ఆల్కహాల్‌ తాగడమే అని భావిస్తారు.

Update: 2024-02-07 16:00 GMT

Fatty Liver Problem: మీరు మద్యం తాగకున్నా ఫ్యాటి లివర్‌ సమస్య వస్తుంది.. కారణం ఏంటంటే..?

Fatty Liver Problem: ఈ రోజుల్లో చాలామంది లివర్‌ సమస్యల బారిన పడుతున్నారు. దీనికి కారణం ఆల్కహాల్‌ తాగడమే అని భావిస్తారు. కానీ మీరు మద్యం తాగకున్నా ఫ్యాటి లివర్‌ సమస్య వస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి తీవ్రంగా మారి లివర్‌ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. మరికొన్నిసార్లు లివర్‌ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. ఈ రకమైన వ్యాధిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

చాలామంది తాము మద్యం తాగకున్నా మాకెందుకు ఈ వ్యాధి వస్తుందని ప్రశ్నిస్తారు. దీనికి కారణం చెడు జీవనశైలి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఫ్యాటీ లివర్ వస్తోంది. WHO నివేదిక ప్రకారం జనాభాలో దాదాపు 25% మందికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉంది. అమెరికాలో దాదాపు 100 మిలియన్ల మందికి ఈ వ్యాధి ఉంది. భారతదేశంలో కూడా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ పెరగడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది.

నిపుణులు ఏమంటున్నారు..

ఈ వ్యాధిలో మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొన్ని సందర్భాల్లో కడుపు కుడి ఎగువ భాగంలో అలసట, నొప్పి మొదలవుతాయి. ఈ వ్యాధి తీవ్రంగా మారితే చర్మంపై దురద, కాళ్ళలో నొప్పి, వాపు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తీవ్రమైన లివర్‌ వ్యాధి లక్షణాలు. ఇవి లివర్‌ సిర్రోసిస్‌కు కూడా సంకేతం కావచ్చు. ఈ వ్యాధి వస్తే కొంతకాలానికి లివర్‌ ఫెయిల్యూర్‌ జరుగుతుంది.

ఎలా రక్షించాలి

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను నివారించాలంటే ఆహారంలో ఉప్పు, పంచదార, మైదా తగ్గించాల్సి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోండి. జీవనశైలిని చక్కగా ఉంచండి. రోజుకు కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. శరీరంలో డీ హైడ్రేషన్‌ లేకుండా చూసుకోవాలి.

Tags:    

Similar News