Womens Health: ముప్పై దాటిందా? అయితే ఈ పండ్లు తినకపోతే మీ ఆరోగ్యానికి ముప్పే

Womens Health : 30 ఏళ్లు దాటాయంటే చాలు.. మహిళల శరీరంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. హార్మోన్ల అసమతుల్యత, ఎముకల బలహీనత, నీరసం వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది.

Update: 2026-01-19 08:30 GMT

Womens Health: ముప్పై దాటిందా? అయితే ఈ పండ్లు తినకపోతే మీ ఆరోగ్యానికి ముప్పే

Womens Health: 30 ఏళ్లు దాటాయంటే చాలు.. మహిళల శరీరంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. హార్మోన్ల అసమతుల్యత, ఎముకల బలహీనత, నీరసం వంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే ఈ వయసులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. 30 దాటిన మహిళలు తప్పనిసరిగా తినాల్సిన ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి దానిమ్మ అద్భుతమైన పరిష్కారం. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా, పీరియడ్స్ సమయంలో వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది. ఇక రోజూ ఒక అరటిపండు తినడం వల్ల అందులోని పొటాషియం కండరాల నొప్పులను తగ్గించి, మీ మూడ్‌ని హుషారుగా ఉంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, హార్మోన్లు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలన్నా బొప్పాయిని మించిన పండు లేదు.

వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలంటే బెర్రీలు (బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ) తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖంపై ముడతలు రాకుండా కాపాడతాయి. జామపండులో ఉండే విటమిన సి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇక అవోకాడోలోని హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ ఇ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి కాంతివంతంగా మారుస్తాయి. చర్మం బిగుతుగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని కివీ పండు పెంచుతుంది.

Tags:    

Similar News