Healthy Heart Tips: అలసట, ఆయాసం అనిపిస్తుందా.. తస్మాత్ జాగ్రత్త మీ గుండె డేంజర్లో ఉన్నట్లే

Healthy Heart Tips: ఎప్పుడైనా చిన్నపాటి అలసట, ఆయాసం అనిపిస్తే లైట్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త..

Update: 2025-07-03 07:55 GMT

Healthy Heart Tips: అలసట, ఆయాసం అనిపిస్తుందా.. తస్మాత్ జాగ్రత్త మీ గుండె డేంజర్లో ఉన్నట్లే

Healthy Heart Tips: ఎప్పుడైనా చిన్నపాటి అలసట, ఆయాసం అనిపిస్తే లైట్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. అవి మీ గుండెలో బ్లాకేజీలు ఉన్నాయనడానికి సంకేతాలు కావొచ్చు. ఇప్పుడు చాలామందికి, ముఖ్యంగా చిన్న వయసులోనే గుండె సమస్యలు వస్తున్నాయి. గుండెకు రక్తం తీసుకెళ్లే నరాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని హార్ట్ బ్లాకేజ్ అంటారు. ఇది నెమ్మదిగా రక్తం ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దాంతో గుండెకు సరిపడా ఆక్సిజన్, పోషకాలు అందవు. సమయం గడిచేకొద్దీ బ్లాకేజ్ పెరిగి, గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది.

గుండెలో బ్లాకేజీలు రావడానికి చాలా కారణాలున్నాయి. మన లైఫ్ స్టైల్ ముఖ్య కారణం. ఎక్కువగా నూనె పదార్థాలు, కొవ్వు ఉన్న ఆహారం తినడం, పొగతాగడం, మద్యం సేవించడం, అసలు ఎక్సర్‌సైజ్ చేయకపోవడం, ఎప్పుడూ ఒత్తిడిలో ఉండటం.. ఇవన్నీ బ్లాకేజీలకు దారితీస్తాయి. వీటితో పాటు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటివి కూడా గుండె సమస్యలకు కారణం అవుతాయి. వయసు పెరిగే కొద్దీ నరాలు సాగే గుణాన్ని కోల్పోవడం వల్ల కూడా బ్లాకేజీలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

గుండె బ్లాకేజీలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. మొదట్లో చిన్నపాటి అలసట, చిన్న పని చేసినా శ్వాస అందకపోవడం లాంటివి కనిపిస్తాయి. కానీ బ్లాకేజీలు పెరిగితే, ఛాతీలో నొప్పి లేదా బరువు, నడిచేటప్పుడు లేదా పని చేసేటప్పుడు మంటగా అనిపించడం, నొప్పి ఎడమ చేతికి, మెడకు లేదా వీపుకు పాకడం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం, గుండె దడ, నిద్రలో కూడా ఛాతీలో బరువుగా అనిపించడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే, అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.

ఈ బ్లాకేజీలు రాకుండా చూసుకోవడం పెద్ద కష్టం కాదు. హెల్తీ డైట్ తీసుకోవడం, రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, పొగతాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయడం, రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా మెడిటేషన్ చేయడం, మరియు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవడం.. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Tags:    

Similar News