Skin Care: డెలివరీ తర్వాత చర్మం ముడతలు పడుతుందా..! ఇలా చేయండి..

Skin Care: తల్లిగా మారడం ఏ మహిళకైనా జీవితంలో మరచిపోలేని ఘట్టం.

Update: 2021-11-12 14:00 GMT

డెలివరీ తరువాత చర్మం ముడుతలు వస్తుందా (ఫైల్ ఇమేజ్)

Skin Care: తల్లిగా మారడం ఏ మహిళకైనా జీవితంలో మరచిపోలేని ఘట్టం. అయితే ఈ అనుభూతి మహిళలకి మానసిక ఆనందంతో పాటు శారీరక సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ఉంటాయి. వాటి కారణంగా మొటిమలు, నల్లటి వలయాలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు సంభవిస్తాయి. డెలివరీ తర్వాత కూడా ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు డెలివరీ తర్వాత మహిళ శరీరంలో పోషకాల కొరత ఉంటుంది. అంతేకాదు తల్లి అయిన తర్వాత మహిళ పిల్లల బాధ్యతలో చిక్కుకుపోతుంది. అటువంటి పరిస్థితిలో చర్మం మరింత డల్‌గా మారుతుంది. ఇలాంటప్పుడు ఈ హోం రెమిడీస్ బాగా ఉపయోగపడుతాయి.

1. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మసాలా ఆహారాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారంలో పండ్లు, రసాలు, కొబ్బరి నీళ్లు, పచ్చి కూరగాయలు, పెరుగు, సలాడ్ మొదలైనవి ఉండేలా చూసుకోవాలి.

2. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా సరైన మోతాదులో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.

3. ముఖం నుంచి ఆయిల్‌ని తొలగించడానికి రోజుకు రెండు-మూడు సార్లు కడగాలి. అలాగే క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ తప్పనిసరి.

4. డెలివరీ తర్వాత మహిళలకు తగినంత నిద్ర ఉండదు. దీని కారణంగా నల్లటి వలయాలు ఏర్పడుతాయి. అటువంటి పరిస్థితిలో మహిళలు ఒక టైం టేబుల్‌ పాటించాలి. బిడ్డ ఎప్పుడు నిద్రపోతాడో అప్పుడే మీరు కూడా నిద్రించాలి.

5. చర్మంపై అదనపు జాగ్రత్తలు తీసుకోండి. దీని కోసం మీరు ఎండలోకి వెళ్ళినప్పుడల్లా సన్‌స్క్రీన్ క్రీమ్ రాయడం మర్చిపోవద్దు. అంతే కాకుండా ముఖాన్ని చల్లటి వస్త్రంతో కప్పుకుంటే మంచిది.

6. డెలివరీ తర్వాత మార్కెట్లో రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఇంటి నివారణలను పాటించాలి. నల్లటి వలయాల సమస్యను తొలగించడానికి రాత్రి పడుకునేటప్పుడు బాదం నూనె లేదా ఆలివ్ నూనెను అప్లై చేయవచ్చు. అదేవిధంగా ఇతర ముఖ సమస్యలకు హోమ్ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు.

Tags:    

Similar News