Kidney Stone: బీర్‌ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం ఏంటంటే..?

Kidney Stone: ఈ రోజుల్లో చెడ్డ ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది.

Update: 2022-08-12 13:30 GMT

Kidney Stone: బీర్‌ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం ఏంటంటే..?

Kidney Stone: ఈ రోజుల్లో చెడ్డ ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల చాలా బాధ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు రాళ్ల వల్ల మూత్ర విసర్జన ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని కొందరు అంటున్నారు. బీర్ తాగడం వల్ల శరీరంలో యూరిన్‌ ఎక్కువగా తయారవుతుంది. టాయిలెట్‌ ఫాస్ట్‌గా వస్తుంది. ఈ స్పీడ్‌లో చిన్న చిన్న రాయి ముక్కలు బయటకు వస్తాయని చెబుతున్నారు. కానీ అతిగా బీర్ తాగడం వల్ల రాళ్ల సమస్య ఉన్నవారికి మరింత హాని కలుగుతుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

1. పెద్ద రాళ్లు బయటకు రావు: మీ శరీరంలోని రాళ్ల పరిమాణం పెద్దగా ఉంటే అవి బయటకి రావడం కష్టమవుతుంది. రాయి పరిమాణం 5 మిమీ కంటే తక్కువగా ఉంటే అది టాయిలెట్ గుండా వెళుతుంది. అంతకంటే పెద్ద పరిమాణపు రాయిని తొలగించడానికి మీరు వైద్యుడిని సంప్రదించాలి.

2. బీర్ డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది: ఎక్కువ బీర్ తాగడం వల్ల శరీరం నుంచి రక్తాన్ని శుద్ధి చేయడానికి కిడ్నీ ఎక్కువ శ్రమ పడుతుంది. దీంతో కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది. బీర్ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది శరీరం కణాలు, పనితీరును ప్రభావితం చేస్తుంది.

3. రాయి పరిమాణం పెరగవచ్చు: ఎక్కువ బీరు తాగడం వల్ల కిడ్నీలో రాయి పరిమాణం పెరుగుతుంది. బీర్ శరీరంలో అధిక ఆక్సలేట్ స్థాయిని పెంచుతుంది. ఇది రాయి పరిమాణాన్ని పెంచడానికి పనిచేస్తుంది.

4. కిడ్నీ వ్యాధులు పెరుగుతాయి: బీరు ఎక్కువగా తాగే వారికి కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

5. రాళ్ల నొప్పులు పెరుగుతాయి: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీరును ఎక్కువసార్లు తాగితే ఈ నొప్పి మరింత పెరుగుతుంది. చాలా సార్లు మూత్ర విసర్జన మార్గంలో రాయి ఇరుక్కుపోయి నొప్పి తీవ్రమవుతుంది.

Tags:    

Similar News