కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా..! మీకు తెలియకుండానే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

కొంతమంది కుర్చీలో కూర్చున్న, బల్లపై కూర్చున్న, గోడపై కూర్చున్న ఎక్కడ కూర్చున్నా కూడా రెండు కాళ్లు ఊపుతూ ఉంటారు.

Update: 2021-12-30 00:57 GMT

కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా..! మీకు తెలియకుండానే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

Shaking Legs: కొంతమంది కుర్చీలో కూర్చున్న, బల్లపై కూర్చున్న, గోడపై కూర్చున్న ఎక్కడ కూర్చున్నా కూడా రెండు కాళ్లు ఊపుతూ ఉంటారు. అది వారికి తెలియకుండానే జరుగుతుంది. ఎవరైనా గమనించి కాళ్లు ఎందుకు ఊపుతున్నావని అడిగితే ఆ క్షణం ఆపేస్తారు. కొద్ది సేపటికే మళ్లీ ఊపుతుంటారు. అయితే ఇది ఒక చెడ్డ అలావాటు. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కాళ్లు ఊపడం చాలా మందికి అలవాటు.

ఇది నేరుగా ఎటువంటి హాని చేయదు కానీ ధీర్ఘకాలికంగా ఈ అలవాటు ఆరోగ్య లోపాన్ని సూచిస్తుంది. కాళ్లు కదపడం అలవాటు చేసుకోవడం వల్ల నిపుణులు శరీరంలో ఐరన్ లోపించినట్లుగ  చెబుతున్నారు. అలాంటి వారు వైద్యుడి వద్దకు వెళ్లి ఒకసారి చెకప్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం దాదాపు 10 శాతం మందికి కాళ్లు కదపడంలో సమస్యలు ఉన్నాయి.35 ఏళ్లు పైబడిన వారిలో ఇది సర్వసాధారణం. ఇది రెస్ట్‌లెస్ సిండ్రోమ్ నాడీ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే కాళ్ల వణుకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.

అందుకే వైద్యుడి సలహా తీసుకుంటే మంచిది. వాస్తవానికి పాదాలను కదిలేటప్పుడు వ్యక్తిలో డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. దాని కారణంగా అతను మళ్లీ మళ్లీ కదపాలని భావిస్తాడు. నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య గురించి తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేస్తారు. సాధారణంగా శరీరంలో ఐరన్ లోపించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇది కాకుండా గర్భిణీలు, కిడ్నీ, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న రోగులలో, డెలివరీ చివరి రోజులలో ఇటువంటి సమస్యలు సంభవిస్తాయి. రక్తపోటు, షుగర్ పేషెంట్లు, హృద్రోగులలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి చికిత్సకు సాధారణంగా ఐరన్ మాత్రలు సూచిస్తారు. 

Tags:    

Similar News