Kidney Stones: కిడ్నీలో రాళ్లు వచ్చాయా.. కారణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!

Kidney Stones: నేటి కాలంలో కిడ్నీలో రాళ్లురావడం సాధారణంగా మారింది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

Update: 2024-02-17 16:00 GMT

Kidney Stones: కిడ్నీలో రాళ్లు వచ్చాయా.. కారణాలు, చికిత్స విధానం తెలుసుకోండి..!

Kidney Stones: నేటి కాలంలో కిడ్నీలో రాళ్లురావడం సాధారణంగా మారింది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరికొందరు చికిత్స తీసుకొని బయటపడుతున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య చాలా కారణాల వల్ల వస్తుంది. రాళ్లు పెరిగే కొద్ది నొప్పి, అవస్థ ఎక్కువగా ఉంటుంది. అయితే రాళ్లు అనేవి ఒక్క కిడ్నీలో మాత్రమే కాదు మూత్ర నాళం, ప్యాంక్రియాస్, టాన్సిల్స్, లాలాజల గ్రంథులు, పిత్తాశయంలో కూడా ఏర్పడుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

రాళ్లకు సరైన సమయంలో చికిత్స చేయకపోతే రోగి భవిష్యత్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సాధారణంగా రాళ్ల సమస్య 30 నుంచి 40 ఏళ్లలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా రాళ్ల సమస్యతో బాధ పడుతారు. ప్రస్తుతం చాలా మంది కిడ్నీ స్టోన్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మూత్రంలో కెమికల్స్ ఎక్కువగా ఉండటం, శరీరంలో మినరల్స్ లోపించడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, నీళ్లు తక్కువగా తాగడం వంటి కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి. సాధారణంగా కిడ్నీ స్టోన్స్‌లో నాలుగు రకాలు ఉంటాయి. వాటిలో కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ రాళ్లతో బాధపడే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

అధిక ఆల్కహాల్, ధూమపానం, అధిక కొవ్వు, ప్రోటీన్ ఆహారాలు తినడం వల్ల క్లోమంలో రాళ్లు ఏర్పడతాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, హై బీపీ కారణంగా లాలాజల గ్రంథిలో రాళ్లు ఏర్పడుతాయి. రాళ్ల చికిత్స దాని పరిమాణం, రోగి శారీరక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి కిడ్నీలో రాళ్లు ఉంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. లాలాజల గ్రంథి రాళ్ల చికిత్సకు సియాలెండోస్కోపీ శస్త్రచికిత్స చేస్తారు. కొన్నిసార్లు వైద్యులు రాళ్ల చికిత్స కోసం షాక్ వేవ్ థెరపీని కూడా సూచిస్తారు.

Tags:    

Similar News