Popcorn Brain: మీది పాప్‌కార్న్ బ్రెయినా? ఇలా చెక్ చేసుకోండి!

ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదేపనిగా దానికి అతుక్కుపోతున్నారా? ఎంత వాడొద్దనుకున్నా ఫోన్ పట్టుకుంటే టైం తెలీట్లేదా.. అయితే మీకు పాప్‌కార్న్ బ్రెయిన్ లక్షణాలున్నాయేమో చెక్ చేసుకోవాల్సిందే. అసలేంటీ పాప్‌కార్న్ బ్రెయిన్.

Update: 2025-10-06 02:50 GMT

 Popcorn Brain: మీది పాప్‌కార్న్ బ్రెయినా? ఇలా చెక్ చేసుకోండి!

ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదేపనిగా దానికి అతుక్కుపోతున్నారా? ఎంత వాడొద్దనుకున్నా ఫోన్ పట్టుకుంటే టైం తెలీట్లేదా.. అయితే మీకు పాప్‌కార్న్ బ్రెయిన్ లక్షణాలున్నాయేమో చెక్ చేసుకోవాల్సిందే. అసలేంటీ పాప్‌కార్న్ బ్రెయిన్.

నోటిఫికేషన్ రాకపోయినా అదేపనిగా ఫోన్ చెక్ చేసుకోవడం, ఫోన్ పట్టుకుంటే టైం తెలియకపోవడం, చిన్నచిన్న విషయాలకే కోపం రావడం, ఫోన్ వాడకూడదని యాప్స్ అన్‌ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఉండలేక తిరిగి ఇన్‌స్టాల్ చేయడం.. ఇలాంటి లక్షణాలుంటే దాన్ని పాప్‌కార్న్ బ్రెయిన్ అంటారట. ఇది మానసిక సమస్య కాకపోయినా దీన్నుంచి బయటపడకపోతే ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగే అవకాశముంది.

పాప్‌కార్న్ వేగించేటప్పుడు ఎలాగయితే టప్‌టప్ మంటూ ఒక్కో విత్తనం విచ్చుకుంటుందో మెదడులో ఆలోచనలు కూడా ఒక్కోటిగా మారుతూ ఉంటే దాన్ని పాప్‌కార్న్ బ్రెయిన్ అనొచ్చు. ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోవడం, దృష్టి పెట్టలేకపోతున్నందుకు మీమీద మీకే కోపం రావడం, మళ్లీ అన్నీ మర్చిపోయి సమయం వృథా చేయడం.. ఇదీ పాప్‌కార్న్ బ్రెయిన్ ధోరణి. దీన్నుంచి ఎలా బయటపడొచ్చంటే..

పాప్‌కార్న్ బ్రెయిన్ అనేది మొబైల్ వాడకం వల్ల మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఇది టీనేజీ ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఫోకస్ దెబ్బతిని, ఒత్తిడి పెరుగుతుంది. అలాగే నిద్ర లోపించి ఆరోగ్యమూ దెబ్బ తింటుంది. అందుకే వీలైనంత త్వరగా దీనికి చెక్ పెట్టేయాలి.

మీలో పాప్‌కార్న్ బ్రెయిన్ లక్షణాలున్నట్టు గుర్తిస్తే వెంటనే మొబైల్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. ఇంట్లో కంటే బయట ఎక్కువగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఆటలు, ప్రయాణాలు, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవచ్చు.

ఫోన్‌లో అవసరం లేని యాప్స్ అన్నీ తీసేసి డేటా ప్యాక్ వేయించకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా నైట్ టైం ఫోన్ వాడకుండా కంట్రోల్ చేసుకోవాలి.

కొద్దికొద్దిగా మొబైల్ వాడకాన్ని తగ్గించుకుంటూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ.. కోపం, చిరాకుని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

Tags:    

Similar News