కూరల్లో వాడే పదార్దాలను మీరు బయట కొంటున్నారా? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి
మీరు కూరల్లో వేయడానికి అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలా పొడులు ఎక్కువగా బయట నుంచి తెచ్చుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండడానికి కెమికల్స్ అదేవిధంగా పొడుల్లో ఇటకపొడులు వంటి హానికరమైన పొడులు కలుపుతున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి.
కూరల్లో వాడే పదార్దాలను మీరు బయట కొంటున్నారా? అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాలి
మీరు కూరల్లో వేయడానికి అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలా పొడులు ఎక్కువగా బయట నుంచి తెచ్చుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండడానికి కెమికల్స్ అదేవిధంగా పొడుల్లో ఇటకపొడులు వంటి హానికరమైన పొడులు కలుపుతున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పదార్ధాలను మీరు వంటల్లో వేసుకుని తింటే ఇక అంతేసంగతులు అని నిపుణులు అంటున్నారు.
పాడవకుండా ఉండేందుకు...
నాన్ వెజ్ కూరలు వండాలన్నా, మసాలా కూరలు వండాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మాసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా వంటి పొడులు అవసరం. వీటితోనే ఆ కూరలు లేదా అన్నానికి రుచి వస్తుంది. అయితే చాలామంది వీటిని ఇంట్లో తయారుచేసుకోకుండా బయట నుంచి తీసుకొచ్చి వంటల్లో వేస్తుంటారు. కానీ ఇలా బయటకొనే పదార్ధాలు వంటల్లో వాడకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఆ పదార్ధాలు చెడిపోకుండా అందులో సోడియం బెంజోయేట్, పోటాషియం సోర్బేట్ వంటి కొన్ని రకాల ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతారు. ఇలా కలపడం వల్ల ఆ పదార్ధం రంగు మారదు. పాడవదు.
మరింత తాజాగా కనిపించేందుకు...
అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా పొడులు పాడవకుండానే కాదు ఇంకా ఫ్రెష్ గా మంచి వాసనతో ఉండాలనే అందులో కృత్రిమ రంగులు, కెమికల్స్ కలుపుతారు. ఇందులో ఏ రంగులు వాడారో ఆ ప్యాకెట్ ఈ కోడ్స్ తో లేబుల్ పైన ఉంటాయి. ఇవి పిల్లలకు చాలా హానిని తలపెడతాయి.
క్వాంటిటీ పెంచేందుకు…
ఇవే కాదు ఈ పదార్దాల క్వాంటిటీ ప్యాకెట్లలో ఎక్కువగా కనిపించాలంటే అందులో కొన్ని నాసిరకాలను కలుపుతారు. ఉదాహరణకు గరం మసాలాల్లో ఇటుక పొడులు కలుపుతున్నట్టు గతంలో చాలా సార్లు ఫుడ్ సేఫ్టీ ఆధికారులు వెల్లడించారు. ఇదే కాకుండా ఇంకా చాలా రకాల నాసిరకం పొడులు వీటిలో కలపడం వల్ల పిల్లలు, పెద్దవాళ్లకు ఒక్కోసారి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఏం చేయాలి?
బద్దకం చేయకుండా, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుని వంటలో వీటిని వాడాలి. ఇలా చేస్తే ఎటువంటి వ్యాధులు దగ్గరకు రావు. రాలేవు.