Ear Pain: చలికాలం చెవినొప్పి వస్తుందా..! అయితే జాగ్రత్త చాలా ప్రమాదం..?

Ear Pain: చలికాలంలో చెవి నొప్పి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి...

Update: 2021-12-19 02:48 GMT

Ear Pain: చలికాలం చెవినొప్పి వస్తుందా..! అయితే జాగ్రత్త చాలా ప్రమాదం..?

Ear Pain: చలికాలంలో చెవి నొప్పి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలు ఉన్నాయి. చెవినొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్టీరియా లేదా వైరస్ అయి ఉంటుంది. ఆ సమయంలో చెవి నొప్పితో పాటు జ్వరం, వాంతులు, తల తిరగడం లాంటివి కూడా ఉంటాయి. ఎక్కువ సేపు చలిలో గడపటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అందుకే చలికాలంలో చెవులను వెచ్చగా ఉండేవిధంగా మప్లర్లు, మంకీ క్యాపుల వంటివి ధరించాలి.

అంతేకాదు జలుబు కారణంగా కూడా చెవి నొప్పి వస్తుంది. ఎక్కువ రోజులు కఫం బయటికి రాకుండా ఉండటం వల్ల చెవినొప్పి కలుగుతుంది. అత్యవసర సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం ఉపశమనం ఉంటుంది. ఉల్లిపాయ రసం అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దీని ద్వారా చెవినొప్పి కూడా నయమవుతుంది. అకస్మాత్తుగా చెవిలో నొప్పి ఉంటే రెండు మూడు చుక్కల ఉల్లిపాయ రసం చెవిలో వేయండి.

ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. శీతాకాలంలో జలుబు త్వరగా సంభవిస్తుంది. సమయానికి చికిత్స తీసుకోపోతే చెవినొప్పి సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే జలుబు రాకుండా చూసుకోవాలి. చెవి నొప్పికి చికిత్స చేయడానికి ఆవాల నూనె కూడా ఉపయోగిస్తారు. నొప్పి ఉన్న చెవిలో ఆవాల నూనెను వేడి చేసి రెండు చుక్కలు వేయండి.

సమస్య తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. తరచుగా దంతాలలో నొప్పి ఉంటే కూడా చెవిలో నొప్పికి కారణం కావచ్చు. ఇందుకోసం వైద్యుల సలహా తీసుకుంటే చాలా మంచిది. అయితే దీనిని ఇంట్లోనే చిట్కాతో కూడా నయం చేయవచ్చు. ఆవాల నూనెలో రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి వేడి చేయాలి. ఈ నూనెలో రెండు చుక్కలు చెవిలో వేయాలి. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది.

Tags:    

Similar News