White Hair: మొదటిసారి తెల్లజుట్టు వచ్చినప్పుడు ఈ తప్పు చేయకండి..!

White Hair: చెడ్డ జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలాసార్లు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తుంది...

Update: 2022-03-20 10:30 GMT

White Hair: మొదటిసారి తెల్లజుట్టు వచ్చినప్పుడు ఈ తప్పు చేయకండి..!

White Hair: ఆధునిక కాలంలో చెడ్డ జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలాసార్లు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తుంది. ఇది కాకుండా అధిక టెన్షన్, చెడు నీటి కారణంగా కూడా సమయానికి ముందే తలపై తెల్ల జుట్టు వస్తుంది. ఈ సమస్యను నివారించడానికి యువత కొన్ని తప్పులు చేస్తుంది. దీని కారణంగా వారు మరింత బాధపడవలసి ఉంటుంది. ముఖ్యంగా వారు తెల్ల జుట్టుకు రంగు వేయడం లేదా వాటిని పీకేయడం చేస్తున్నారు.

ఇది మంచి పద్దతి కాదు.ముందుగా తెల్ల వెంట్రుకలను చూసి ఒత్తిడికి గురికావలసిన అవసరం లేదు. కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మీ జుట్టు అకాలంగా తెల్లబడటం ప్రారంభిస్తే వాటిని ఒక్కోటిగా పీకవద్దు. దీనివల్ల జుట్టు మరింత తెల్లగా మారే అవకాశాలు ఉన్నాయి. తెల్ల వెంట్రుకలు ప్రారంభమైనప్పుడు కెఫిన్ ఉన్న పానీయాలని తగ్గించండి. ఇది కాకుండా ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే వాటిని తినండి.

ఆహారంలో గ్రీన్ టీని తప్పనిసరిగా చేర్చుకోండి. తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే మెహందీని ఉపయోగించండి. ఇది మీ జుట్టుకు సహజమైన మెరుపును అందించడానికి పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మీ జుట్టు మెరిసిపోతుంది. తెల్ల జుట్టుకు రంగు వేయడం వల్ల వాటి సహజ రంగు పోతుంది. మీ జుట్టు రంగును వేయాలని నిర్ణయించుకున్నప్పుడు నూనె ఆధారిత రంగు వాడితే మంచిది. దీనివల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు.

శరీరంలో మెలనిన్ ఉత్పత్తి నిలిచిపోవడం, శరీరంలో పోషకాలు లేకపోవడం, విటమిన్ బి లోపం, ఏదైనా శస్త్రచికిత్స జరగడం లేదా మందులు వాడటం, సరిగా నిద్ర లేకపోవడం, స్టడీస్ లేదా మరేదైనా ఒత్తిడి, వారసత్వం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. ఆహారంలో పప్పులు, మొలకలు చేర్చండి. పాలు, పెరుగు, జున్ను వంటి వాటిని తినండి. రోజూ కొంత సమయం శారీరక శ్రమ చేయండి. ఇందుకోసం ప్రతిరోజు వ్యాయామం, రన్నింగ్, వాకింగ్‌ లాంటివి చేస్తే మంచిది.

Tags:    

Similar News