Health Tips: చలికాలంలో ఈ కూరగాయలని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. ఎందుకంటే..?

Health Tips: చలికాలంలో ఈ కూరగాయలని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. ఎందుకంటే..?

Update: 2022-12-25 02:50 GMT

Health Tips: చలికాలంలో ఈ కూరగాయలని ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. ఎందుకంటే..?

Health Tips: రిఫ్రిజిరేటర్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనివల్ల ఆహారాన్ని నిల్వ చేయడం చాలా సులభం అయింది. వారానికి సరిపడ కూరగాయలు కొని ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నారు. అయితే శీతాకాలంలో కొన్ని కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయి. అలాంటి కూరగాయల గురించి తెలుసుకుందాం.

1. వెల్లుల్లి

వెల్లుల్లిని వంటగదిలో ఒక చిన్న బుట్టలో ఉంచడం ఉత్తమం. గది ఉష్ణోగ్రత వద్ద ఇది చాలా రోజులు తాజాగా ఉంటుంది. పొట్టు తీసి లేదా గ్రైండ్ చేసి ఫ్రిజ్‌లో ఉంచితే అందులో ఉండే పోషకాలు తగ్గుతాయి.

2. దోసకాయ

మనం దోసకాయలను సలాడ్ రూపంలో తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శీతాకాలంలో వీటిని కొనుగోలు చేస్తే ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దు. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి లేదంటే ఆరోగ్యం క్షీణిస్తుంది.

3. టొమాటో

చలికాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండదు కాబట్టి టమోటాలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచవచ్చు. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే రుచి మారుతుంది.

4. బంగాళదుంప

బంగాళాదుంపను కూరగాయలలో రారాజు అంటారు. ఎందుకంటే దీనిని ఏదైనా కూరగాయలతో కలిపి వండవచ్చు. బంగాళాదుంపలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుంది. దీని వల్ల ఊబకాయం, గ్లూకోజ్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News