Diabetic Patients: డయాబెటిక్‌ పేషెంట్లు ఈ కార్భోహైడ్రేట్స్‌ను తీసుకోవాలి.. ఎందుకంటే..?

Diabetic Patients: భారతదేశంలో డయాబెటిక్‌ పేషెంట్లు రోజు రోజుకు పెరుగుతున్నారు. డయాబెటిక్‌ ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురువుతాయి.

Update: 2023-10-22 03:00 GMT

Diabetic Patients: డయాబెటిక్‌ పేషెంట్లు ఈ కార్భోహైడ్రేట్స్‌ను తీసుకోవాలి.. ఎందుకంటే..?

Diabetic Patients: భారతదేశంలో డయాబెటిక్‌ పేషెంట్లు రోజు రోజుకు పెరుగుతున్నారు. డయాబెటిక్‌ ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురువుతాయి. బాడీలోని ఆర్గాన్స్‌ దెబ్బతినే అవకాశాలుంటాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇటీవల మధుమేహంపై ఒక అధ్యయనాన్ని విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది షుగర్‌ పేషెంట్లు ఉన్నారు. ఇది కాకుండా 136 మిలియన్లలో ప్రీ డయాబెటిస్ లక్షణాలు కనిపించాయి. డయాబెటిస్‌లో మెటబాలిక్ డిజార్డర్‌తో బాధపడేవారు పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్లను చేర్చడం చాలా ముఖ్యం. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పిండి పదార్థాలు

డయాబెటిక్ రోగుల్లో చాలా మందికి కార్బోహైడ్రేట్లను ఎలా తీసుకోవాలో తెలియదు. కార్బో హైడ్రేట్లు తక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితిలో, శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. షుగర్ పేషెంట్లు ప్రతి భోజనంలో 40 నుంచి 50 గ్రాముల పిండి పదార్థాలను చేర్చుకోవాలి.

క్వినోవా

క్వినోవాలో ప్రోటీన్‌, ఫైబర్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. క్వినోవా సహజంగా తీపిగా ఉండి రుచిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ మెయింటెయిన్ అవుతుంది. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది.

చిలగడ దుంప

స్వీట్ పొటాటోలో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చిలగడదుంప మీ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, బరువు తగ్గించడంల సహాయపడుతుంది. చిలగడ దుంపలు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ల కోసం మంచి ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

బీన్స్

బీన్స్ నుంచి కార్బోహైడ్రేట్లను పొందవచ్చు. చిక్కుళ్లు మీకు ఎక్కువ కాలం శక్తిని ఇస్తాయి. మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతాయి. పాస్తా అనారోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. కానీ పిండి పదార్థాల కోసం పాస్తా తినవచ్చు.

Tags:    

Similar News