Coriander Powder: ధనియాలతో ఆ సమస్యలు దూరం చేసుకోవచ్చు..

ధనియాలతో ఆ సమస్యలు దూరం చేసుకోవచ్చు.. ధనియాలతో ఆ సమస్యలు దూరం చేసుకోవచ్చు..

Update: 2019-10-16 05:21 GMT

మనకు చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతుంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. పూర్వం ఎంత పెద్ద వ్యాధులు సోకినప్పటికి ఇంట్లో ఉండే పకృతి సిద్దమైన వాటితోనే వ్యాధులను నయం చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు బలుబు లాంటి చిన్న సమస్యకు కూడా ఇంగ్లిష్ మందులను వాడుతున్నాం. అలా కాకుండా వంటింటి చిట్కాతో వ్యాధులను నయం చేసుకోవచ్చు. వాటిలో ధనియాలు అర్యోగంగా ఉండానికి ఉపయోగపడతాయి.

నోటి సంబంధించిన వ్యాధులను పోగొట్టడడంలో ధనియాలు బాగా ఉపయోగపడుతాయి. నోట్లో పొక్కులు లాంటివి ఏర్పడిన లేదా గొంతుకు సంబంధించిన వ్యాధులేవైనా ఉంటే ధనియాల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించండి. దీంతో చాలా వాటి నోప్పి నుంచి ఉపశమనం దోరుకుతుంది. ధనియాలు వంటల్లో ఉపయోగించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది.

తలనొప్పితో బాధపడేవారు నుదుటిపై కొత్తిమీరను రుబ్బుకుని లేపనంలాగా పూసుకుంటే తప్పనిసరగా ఉపశమనం కలుగుతుంది. అతేకాకుండా దెబ్బ తగిలి వాపున్న చోట ఈ లేపనాన్ని రాయడం వల్ల బాగ ఉపశమనం లభిస్తుంది.

ఎప్పుడైనా కళ్ళు నొప్పిగా వాపుగా అనిపించినప్పుడు ధనియాలను పొడిని నీటిలో ఉడకబెట్టిన తర్వాత వాటి చుక్కల మందులా కొంచెం కంట్లో వేసుకోవాలి. దీంతో వాపు, నొప్పి, మంట మటుమాయమవుతాయని నిపుణులు అంటున్నారు.

బాగా వేడి చేసి ముక్కు నుంచి రక్తం కారుతుంటే కొత్తమిర రసాన్ని తీసి ముక్కుకు రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ముక్కులో నుంచి రక్తం రావడం తగ్గుతుంది. వేడి వలన కడుపు నొప్పి వచ్చినప్పుడు ధనియాల చూర్ణాన్ని కలిపి సేవిస్తే మంచి ఫలితముంటుంది. 

Tags:    

Similar News