Constipation: వీటిని తింటే మలబద్దకం ఉండదు.. త్వరగా ఉపశమనం..!

Constipation:ఆధునిక యుగంలో కూర్చొని చేసే ఉద్యోగాలు పెరిగిపోవడంతో చాలా మందిలో మలబద్దక సమస్య ఎదురవుతోంది.

Update: 2023-10-08 16:00 GMT

Constipation: వీటిని తింటే మలబద్దకం ఉండదు.. త్వరగా ఉపశమనం..!

Constipation: ఆధునిక యుగంలో కూర్చొని చేసే ఉద్యోగాలు పెరిగిపోవడంతో చాలా మందిలో మలబద్దక సమస్య ఎదురవుతోంది. దీనితో పాటు జీవనశైలి, ఆహార విధానంలో మార్పుల వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతోంది. ఒత్తిడి, హార్మోన్ల హెచ్చుతగ్గులు, తక్కువ ఫైబర్ ఆహారం తీసుకోవడం కూడా మలబద్ధకానికి కారణం అవుతాయి. అయితే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. అలాగే కొన్ని ఆహారాలు డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. అంజీర్

అంజీర్‌ పండ్లలో ఫైబర్, జింక్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఎండిన అంజీర్‌ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఒకటి లేదా రెండు అంజీర్‌ ముక్కలను రాత్రంతా నానబెట్టి ఉదయమే పాలలో కలుపుకొని తినాలి. అయితే అంజీర్‌ పండ్లను ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోండి. ఒకటి లేదా రెండు ముక్కలు సరిపోతాయి.

2. అవిసె గింజలు

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ఒక టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్స్‌లో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. యాపిల్స్

రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతారు. ఎందుకంటే యాపిల్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, కాపర్, విటమిన్ కెలను అందిస్తుంది. యాపిల్స్ బరువు తగ్గడానికి, గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

Tags:    

Similar News