Cockroach Milk: బొద్దింక పాలు పిల్లలకు బలాన్ని ఇస్తాయా? శాస్త్రవేత్తలు సూపర్ మిల్క్ అని పిలుస్తున్నారు?
Cockroach Milk: సూపర్ ఫుడ్స్ అంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, వీటిలో ఆకుకూరలు, బెర్రీలు, గింజలు ఉంటాయి. కానీ తాజాగా శాస్త్రవేత్తలు బొద్దింక పాలను సూపర్ ఫుడ్ అని తేల్చారు. బొద్దింక పాలు ఏంటీ అని మీకు వింతగా అనిపించవచ్చు. కానీ డిప్లోప్టేరా పంక్టాటా అనే బొద్దింక జాతి తయారు చేసే పాలు ఆవు పాలకంటే మూడు రెట్లు పోషకమైనవి అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పాలలో ప్రోటీన్లు, కొవ్వులు చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత పోషకాలు అధికంగా ఉండే ఆహారాలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.
ఆడ పసిఫిక్ బీటిల్ బొద్దింకలు ఈ పాలను తమ పిల్లలకు తాగించినప్పుడు, అది వాటి కడుపులో స్ఫటికాల రూపంలో పేరుకుపోయి, వాటి పెరుగుదలకు, కణాల మరమ్మత్తుకు సహాయపడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఈ పాలలో గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కేలరీలు ఉంటాయి. ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర శక్తిని, పోషణను పెంచడంలో సహాయపడుతుంది.భవిష్యత్తులో, ముఖ్యంగా పోషకాహార లోపం తీవ్రమైన సమస్యగా ఉన్న ప్రదేశాలలో ఈ పాలు స్థిరమైన, ప్రత్యామ్నాయ ఆహార వనరుగా ఉపయోగపడతాయని పోషకాహార నిపుణులు విశ్వసిస్తున్నారు. ఇది పోషక శక్తి కేంద్రంగా ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. అయతే ప్రస్తుతానికి ఈ పాలను మానవులు తాగేందుకు అందుబాటులోలేవు. కానీ భవిష్యత్తులో దీనిని ఉత్పత్తి చేసి సమర్థవంతంగా ప్రాసెస్ చేస్తే అది విప్లవాత్మక పోషక వనరుగా మారవచ్చు.