Health News: తులసి, కలబందతో థైరాయిడ్‌కి చెక్ పెట్టండి..!

Health News: తులసి, కలబందతో థైరాయిడ్‌కి చెక్ పెట్టండి..!

Update: 2022-03-27 14:44 GMT

Health News: తులసి, కలబందతో థైరాయిడ్‌కి చెక్ పెట్టండి..!

Health News: థైరాయిడ్‌తో బాధపడుతున్న ఒక వ్యక్తి ఊబకాయంతో ఇబ్బంది పడతాడు. ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. శరీరంలో అయోడిన్ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో వారు అధికంగా బరువు పెరుగుతారు. అలాగే శరీరం బలహీనంగా మారుతుంది. ఇది అనేక వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి థైరాయిడ్‌ అదుపులో ఉండాలంటే తులసి ఆకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాకుండా తులసి, కలబందని కలిపి ఉపయోగించడం ద్వారా కూడా ఈ వ్యాధి తగ్గించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

తులసి ఆకుల ప్రయోజనాలు

తులసి ఆకుల ద్వారా థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ సమస్యలకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. థైరాయిడ్‌ను వదిలించుకోవడానికి తులసి ఆకుల నుంచి రసాన్ని తీసి ఒక చెంచా కలబంద రసంలో కలపండి. ఆ తర్వాత దానిని తింటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది కాకుండా మీరు తులసి టీని కూడా తీసుకోవచ్చు. టీలో పాలు లేకుండా తులసి ఆకులను వేసి తాగాలి. ఇలా చేస్తే థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది.

థైరాయిడ్‌ని తగ్గించడంలో పసుపు బాగా పనిచేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ లభిస్తాయి. పసుపు ఏ వంటకంలోనైనా ఈజీగా కలిసిపోతుంది. ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగినవి. ఈ పోషకాలు తగినన్ని లభించడానికి రోజూ ఫ్లాక్స్ సీడ్స్, వర్జిన్ ఆలివ్ ఆయిల్ లేదా వాల్నట్స్ ను డైట్ లో యాడ్ చేసుకోండి. లేదా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ ను మీ డైట్ రొటీన్ లో ఇంక్లూడ్ చేయండి.

Tags:    

Similar News