Diabetic Patients: షుగర్‌ పేషెంట్లు వేరుశెనగ తినవచ్చా.. ఎలాంటి ప్రభావం చూపుతుంది..!

Diabetic Patients: షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిసారి ఏం తినాలి, ఏం తినకూడదు అనే సందిగ్ధంలో ఉంటారు.ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది.

Update: 2023-11-12 04:00 GMT

Diabetic Patients: షుగర్‌ పేషెంట్లు వేరుశెనగ తినవచ్చా.. ఎలాంటి ప్రభావం చూపుతుంది..!

Diabetic Patients: షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిసారి ఏం తినాలి, ఏం తినకూడదు అనే సందిగ్ధంలో ఉంటారు.ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో కిడ్నీ వ్యాధి, గుండె జబ్బులు, కంటిచూపు బలహీనపడే ప్రమాదం ఉంది. కొంతమంది షుగర్‌ పేషెంట్లు వేరుశెనగ తినవచ్చా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు. వారి గురించి ఈ విషయలను గమనిద్దాం.

వేరుశెనగలోని పోషకాలు

పోషకాహారాలలో వేరుశెనగ ఒకటి. దీనిని తినడం వల్ల శరీరానికి సమృద్ధిగా ప్రోటీన్, విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్-B కాంప్లెక్స్, పాంతోతేనిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఉదయాన్నే వేరుశెనగ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అదనంగా మెగ్నీషియం వేరుశెనగ వెన్న లభించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తేల్చింది.

ఇతర ప్రయోజనాలు

1. కొలెస్ట్రాల్ తగ్గుతుంది

వేరుశెనగ తినడం వల్ల సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రొటీన్, మోనోశాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. డయాబెటిక్ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు వేరుశెనగ తినాలి.

2. ఆరోగ్యకరమైన కొవ్వు

వేరుశెనగను 'పేదవాళ్ల బాదం' అని పిలుస్తారు. ఇది మనకు ఆరోగ్యకరమైన కొవ్వును పుష్కలంగా అందిస్తుంది. దీనిని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యకరమైన కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

3. తక్కువ బరువు

డయాబెటిక్ పేషెంట్లు వేరుశెనగ తింటే చాలా సమయం కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల వారు అదనంగా ఆహారం తీసుకోకుండా ఉంటారు. దీంతో సులువుగా బరువు తగ్గుతారు.

Tags:    

Similar News