Diabetes For Children: పిల్లల మధుమేహాన్ని మందులు లేకుండా నయం చేయవచ్చా?

Diabetes For Children: ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి గతంలో కేవలం పెద్దలకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది.

Update: 2025-05-27 05:30 GMT

Diabetes For Children: పిల్లల మధుమేహాన్ని మందులు లేకుండా నయం చేయవచ్చా?

Diabetes For Children: ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి గతంలో కేవలం పెద్దలకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. ముఖ్యంగా పిల్లలలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే ఈ తీవ్రమైన వ్యాధి పిల్లలకు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఎందుకంటే, పిల్లలను ఆహార విషయంలో నియంత్రించడం చాలా కష్టం. దీనితో పాటు, తల్లిదండ్రులు తమ పిల్లలకు నిరంతరం మందులు ఇవ్వడం చాలా బాధాగా ఉంటుంది.అయితే, పిల్లల మధుమేహాన్ని మందులు లేకుండా నయం చేయవచ్చా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లల్లో కూడా టైప్-1, టైప్-2 డయాబెటిస్ కనిపిస్తున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం జన్యుపరమైనది. టైప్ 1 డయాబెటిస్‌లో ఇన్సులిన్ తగినంత పరిమాణంలో ఉత్పత్తి చేయబడదు లేదా అస్సలు ఉత్పత్తి చేయబడదు. టైప్ 2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ కణాలు ఇన్సులిన్‌కు తగినంతగా స్పందించవు. టైప్-1 డయాబెటిస్ చిన్న పిల్లలలో సంభవిస్తుంది. టైప్-2 డయాబెటిస్ టీనేజర్లలో కనిపిస్తుంది. పిల్లల్లో డయాబెటిస్‌ను నియంత్రించడం చాలా కష్టం. దీని కోసం, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

వైద్యులు ఏమంటున్నారు?

పిల్లల మధుమేహం కాలక్రమేణా నయం కాదని నిపుణులు అంటున్నారు. దీన్నికేవలం అదుపులో ఉంచుకోవాలి. జీవనశైలి మార్పులు, ఇన్సులిన్ థెరపీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. పిల్లలకు సమతుల్య ఆహారం ఇవ్వాలి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు ప్రతిసారీ ఒకే ఆహారం తినలేరు. అందువల్ల తల్లిదండ్రుల బాధ్యత పెరుగుతుంది. పిల్లలు క్రమం తప్పకుండా వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. పిల్లల చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. తద్వారా శరీరంలోని ఇతర భాగాలపై మధుమేహం ప్రభావాన్ని నివారించవచ్చు.

Tags:    

Similar News