Caffeine Dreams: టీ, కాఫీ మానేస్తే కలలు ఎందుకు స్పష్టంగా కనిపిస్తాయో తెలుసా?
టీ, కాఫీ వంటి పానీయాల్లో ఉండే కెఫిన్ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా అధికంగా తీసుకుంటే పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు.
Caffeine Dreams: టీ, కాఫీ మానేస్తే కలలు ఎందుకు స్పష్టంగా కనిపిస్తాయో తెలుసా?
టీ, కాఫీ వంటి పానీయాల్లో ఉండే కెఫిన్ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా అధికంగా తీసుకుంటే పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు. కెఫిన్ నిద్రపై మాత్రమే కాకుండా, మనం చూసే కలలపై కూడా ప్రభావం చూపుతుందనే ఆసక్తికరమైన అధ్యయనాలు వెలువడ్డాయి.
ఆస్ట్రేలియా CQ యూనివర్సిటీకి చెందిన షార్లెట్ గుప్తా మరియు ఆస్ట్రేలియన్ కాథలిక్ యూనివర్సిటీకి చెందిన కారిస్సా గార్డినర్ చేసిన పరిశోధన ప్రకారం – కెఫిన్ తీసుకోవడం తగ్గించినవారిలో కలలు మరింత స్పష్టంగా, కొన్ని సందర్భాల్లో భయానకంగా కూడా ఉంటాయని తేలింది. కెఫిన్ మానేసిన కొద్ది రోజుల్లోనే ఈ అనుభవం వస్తుందని వారు చెబుతున్నారు.
కెఫిన్ నిద్రను ఎలా ప్రభావితం చేస్తుంది?
కెఫిన్ ఒక స్టిమ్యులెంట్. ఇది మెదడులో ఉండే అడెనోసిన్ అనే రసాయనాన్ని నిరోధిస్తుంది. సాధారణంగా అడెనోసిన్ పెరిగితే మనిషికి నిద్ర వస్తుంది. కానీ కెఫిన్ కారణంగా అది పనిచేయదు. ఫలితంగా సరిగా నిద్ర పట్టదు. కెఫిన్ మానేస్తే, శరీరానికి నిద్ర అవసరం పెరుగుతుంది, విశ్రాంతి ఎక్కువగా లభిస్తుంది.
తక్కువ కెఫిన్ – ఎక్కువ స్పష్టమైన కలలు
టీ, కాఫీ తగ్గించినప్పుడు రాత్రివేళ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. దీని వల్ల కలలు కూడా మరింత స్పష్టంగా, వివరంగా కనబడతాయి. నిద్రలో ఒక దశలో మెదడు అత్యంత చురుకుగా ఉంటుంది – అదే కలలతో సంబంధమున్న దశ. ఈ సమయంలో మంచి విశ్రాంతి దొరికితే కలలు కూడా క్లియర్‌గా కనిపించే అవకాశం ఉంటుంది.
అయితే కెఫిన్ తగ్గించిన ప్రతి ఒక్కరూ వెంటనే ఇలాంటి స్పష్టమైన కలలు చూస్తారనే లేదు. కొంతమందికి కొన్ని రోజులు, మరికొంతమందికి వారాల తర్వాతే ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇంకా దీన్ని నిర్ధారించే పక్కా ఆధారాలు లేకపోయినా, కెఫిన్ – నిద్ర – కలలు మధ్య సంబంధం ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.