Breastfeeding: పాలు ఇవ్వడం వల్ల శిశువుకి మాత్రమే కాదు తల్లికి కూడా ప్రయోజనాలు..!

Breast feeding: అప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాలు అమృతంతో సమానం. వీటివల్ల వారికి ఆకలి తీరడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Update: 2023-08-13 02:30 GMT

Breastfeeding: పాలు ఇవ్వడం వల్ల శిశువుకి మాత్రమే కాదు తల్లికి కూడా ప్రయోజనాలు..!

Breastfeeding: అప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాలు అమృతంతో సమానం. వీటివల్ల వారికి ఆకలి తీరడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకి కనీసం ఆరు నెలలు తల్లిపాలు తాగించాలి. కానీ ఈ రోజుల్లో కొన్ని కారణాల వల్ల కొంతమంది మహిళలు పిల్లలకి డబ్బా పాలు తాగిస్తున్నారు. దీనివల్ల బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు మాత్రమే అందించాలి. అయితే పాలివ్వడం వల్ల శిశువుకి మాత్రమే కాదు తల్లికి కూడా ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలియదు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

పాలివ్వడం వల్ల శిశువుకు కలిగే ప్రయోజనాలు

తల్లి పాలు శిశువులకు సరైన పోషకాహారాన్ని అందిస్తాయి. వీటిలో విటమిన్లు, మాంసకృత్తులు, కొవ్వుల మిశ్రమం ఉంటుంది. బిడ్డ పెరగడానికి అవసరమైన ప్రతీ పోషకం తల్లిపాల ద్వారా అందుతుంది. తల్లిపాలు బిడ్డ జీర్ణవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించవు. శిశువు అనారోగ్యాల బారినపడకుండా వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలు తల్లి పాలలో ఉంటాయి. శిశువుకు ఆస్తమా లేదా అలెర్జీలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మొదటి 6 నెలలు తల్లిపాలు తాగే పిల్లలకు, చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, అతిసారం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

పాలివ్వడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలు

పాలివ్వడం వల్ల తల్లి శరీరంలో అదనపు కేలరీలు ఖర్చవుతాయి. కాబట్టి గర్భధారణ బరువును వేగంగా తగ్గించడంలోనూ, ప్రసవం తర్వాత అధిక బరువు పెరగకుండా సహాయపడుతాయి. శిశువుకు పాలిచ్చేటప్పుడు తల్లుల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది వారి గర్భాశయంను అంతకుముందున్న పరిమాణానికి తీసుకురావడానికి తోడ్పడుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయ రక్తస్రావం తగ్గుతుంది. తల్లి పాలివ్వడం వల్ల రొమ్ము, అండాశయ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. తల్లులలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం తగ్గుతుంది. 

Tags:    

Similar News