Brain Foods: చదివింది చదివినట్టు గుర్తుండాలంటే ఇవి ఇప్పుడే తినండి.. మేధాశక్తి పెరుగుతుంది..!

Brain Boosting Foods: ఇది పరీక్షల కాలం.. విద్యార్థులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా చదివేస్తున్నారు. అయితే, మీ మెదడు చిన్నప్పటి నుంచి రాకెట్‌ కంటే స్పీడ్‌గా పనిచేయాలంటే కొన్ని ఫుడ్స్‌ తినాలి.

Update: 2025-03-13 09:55 GMT

Brain Foods: చదివింది చదివినట్టు గుర్తుండాలంటే ఇవి ఇప్పుడే తినండి.. మేధాశక్తి పెరుగుతుంది..!

Brain Boosting Foods: పిల్లల మెదడు ఆరోగ్యకరమైన పనితీరుకు కూడా ఇవి అవసరం. చదివింది చదివినట్టు గుర్తుండాలంటే కొన్ని ఫుడ్స్ మీ డైట్‌లో ఉండాలి. వీటిని రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే చాలు మెదడు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

బ్లూబెర్రీ..

బ్లూబెర్రీలను బ్రెయిన్‌ ఫుడ్‌ అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్‌గా బ్లూబెర్రీలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది.పిల్లల డైట్‌లో కూడా చిన్నప్పటి నుంచే చేర్చాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని పెట్టాలి. లేదా బ్లూబెర్రీలను బ్లెండ్‌ చేసి స్మూథీ రూపంలో కూడా పిల్లలకు ఇవ్వండి.

పసుపు..

పసుపును గోల్డెన్‌ స్పైస్‌ అని కూడా పిలుస్తారు. పసుపులో కర్కూమిన్‌ ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా ఉంటాయి. పసుపును వివిధ వంటల్లో వినియోగిస్తాం. ఇది బ్రెయిన్‌ సెల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది.

బ్రోకోలీ..

బ్రోకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ కే ఉంటాయి. బ్రోకోలీ ఉడికించి లేదా వేయించి తినవచ్చు. ఈ రెండూ స్పిన్‌గోలిపిడ్స్‌ ఏర్పాటుకు అత్యవసరం. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. బ్రోకోలీ రెగ్యులర్‌ డైట్‌లో తీసుకుంటే బ్రెయిన్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. ఒక షీల్డ్‌లా పనిచేస్తాయి.

గింజలు..

గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వాల్నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు సహాయపడి, ఫ్రీ ర్యాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. మీ బ్రెయిన్‌ సెల్స్‌ను కాపాడే రక్షణ కవచాలు. ప్రతిరోజూ ఓ గుప్పెడు వాల్నట్స్‌ రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవాలి.

కొవ్వు చేప..

కొవ్వు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రెగ్యులర్‌గా కొవ్వు చేప తీసుకోవడం వల్ల అల్జీమర్స్‌ సమస్య రాకుండా ఉంటుంది. వారంలో రెండుసార్లు అయినా కొవ్వు చేప మనడైట్‌లో చేర్చుకోవాలి.

గుమ్మడి గింజలు..

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌, రాగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు పనిచేస్తుంది. గుమ్మడి గింజలు స్నాక్‌ రూపంలో తీసుకోవచ్చు. లేదు సలాడ్‌, కూరలు కూడా తయారు చేసుకుంటారు. ఇది కూడా బెస్ట్‌ బ్రెయిన్‌ బూస్టింగ్‌ ఫుడ్‌.

Tags:    

Similar News