Body Odor Tips: మీ శరీరం నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తుందా? ఇంటి చిట్కాలు ఫాలో ఆ సమస్యకు దూరం
Body Odor Tips: చాలామంది శరీరం నుంచి చెడు వాసన రావడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఎవరితోనూ కలవలేక, ఇంట్లోనే ఉండలేక తెగ బాధపడుతుంటారు. ఇలాంటివారు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు.
Body Odor Tips: మీ శరీరం నుంచి ఎక్కువగా దుర్వాసన వస్తుందా? ఇంటి చిట్కాలు ఫాలో ఆ సమస్యకు దూరం
Body Odor Tips: చాలామంది శరీరం నుంచి చెడు వాసన రావడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఎవరితోనూ కలవలేక, ఇంట్లోనే ఉండలేక తెగ బాధపడుతుంటారు. ఇలాంటివారు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధరణంగా చెమట వ్యక్తిగత శుభ్రత, సరిగా స్నానం చేయకపోవడం, కొవ్వుపదార్దాలు ఎక్కువగా తినడం, మాంసాహారం ఎక్కువగా తినడం, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో చెమట ఎక్కువగా పడుతుంది. అయితే ఈ చెమటలో దుర్వాసన ఎక్కువగా ఉందంటే మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
స్నానం ఎలా చేయాలి?
చాలామంది ఐదు నిమిషాల్లో స్నానం చేసి బయటకు వచ్చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల శరీరంపైన పేరుకుపోయిన దుమ్ముదూళిని సరిగా శుభ్రపరుచుకోలేరు. అందుకే ఎంత సమయంలో స్నానం చేసామని కాకుండా శరీరమంతా శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా శరీరంలో ఎక్కడైతే చర్మం మడత పడి ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువగా శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. దుర్వాసన చెమటతో బాధపడేవారు సబ్బును వాడకుండా శనగపిండి లేదా సున్నిపిండి వాడటం మంచిది.
ఎలాంటి బట్టలు వేసుకోవాలి?
దుర్వాసన చెమటతో బాధపడేవారు కచ్చితంగా కాటన్ దుస్తులనే ధరించాలి. ఏ సీజన్‌లో అయినా కాటన్ దుస్తులను ధరించడం ఆ చెమటను ఈ బట్టలు పీల్చుకోగలుగుతాయి. దీనివల్ల దుర్వాసన సగం తగ్గుతుంది. అలాకాకుండా సిల్క్ బట్టలు వేసుకుంటే అవి చెమటను మరింత పెంచుతాయి. అలాగే చెమట ఎక్కువగా ఉండేవాళ్లు వారి బట్టలను ఉతికినప్పుడు, ఆరేసినపుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. డెటాల్ లేదా సువాసనతో ఉన్న లిక్విడ్‌లో నానబెట్టి ఉతకాలి. ఎండలో ఆరవేయాలి.
మంచి ఆహారం చాలా ముఖ్యం
శరీరంపై చెడువాసన ఎక్కువగా వస్తుంది అంటే తినేఆహారాన్ని కూడా మార్చాలి. ముఖ్యంగా ఎక్కువగా కొవ్వు ఉన్న పదార్ధాలు అలాగే మాంసాహారం తినకూడదు. దీనివల్ల కూడా శరీరంపై మృతకణాలు ఎక్కువగా పేరుకుపోతాయి.
వీటితోపాటు సెంట్, పెర్ఫ్యూమ్‌లకు దూరంగా ఉండాలి. అంతేకాదు మసాలాలు, ఉల్లి, వెల్లులిని ఆహారంలో తగ్గించాలి. ఇక జింక్, ఫైబర్, మెగ్నీషియం ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటే శరీరంపై చెడు వాసన ఎక్కువగా ఉండదు.