Lifestyle: ఆహారం తినడానికి సరైన సమయం ఏంటి.? ఆయుర్వేదం ఏం చెబుతోంది..!
Lifestyle: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Lifestyle: ఆహారం తినడానికి సరైన సమయం ఏంటి.? ఆయుర్వేదం ఏం చెబుతోంది..!
Lifestyle: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఎప్పుడుపడితే అప్పుడు తింటున్నారు. అయితే ఆయుర్వేదంలో భోజనం చేయడానికి సరైన సమయం ఏంటో నిర్ణయించింది. ఇంతకీ ఆహారం తీసుకోవడానికి సరమైన సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టిఫిన్ ఏప్పుడు చేయాలంటే.?
ఉదయం లేవగానే శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలంటే అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం, సూర్యోదయం తర్వాత, ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య అల్పాహారం తీసుకోవడం మంచిది. ఆకలితో ఎక్కువ సమయం ఉండటం ఆరోగ్యానికి హానికరం, కాబట్టి అల్పాహారాన్ని తప్పకుండా మిస్ కాకూడదు.
భోజనం ఏప్పుడంటే.?
అల్పాహారం తర్వాత భోజనం తీసుకునే సమయాన్ని చాలా గ్యాప్ ఇవ్వకూడదు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య భోజనం చేయడం ఉత్తమం. ఈ సమయంలో జీర్ణశక్తి బలంగా ఉంటుంది, కాబట్టి తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
డిన్నర్ విషయానికొస్తే..
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం జీర్ణ సంబంధ సమస్యలకు కారణమవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య భోజనం చేయడం మంచిది. రాత్రి తేలికపాటి ఆహారం తీసుకుంటే, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా, మంచి నిద్ర పొందవచ్చు. పడుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు గంటల ముందే డిన్నర్ కంప్లీట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి.