Home Remedies for Dry Cough: పొడి దగ్గు.. నివారణా మార్గాలు

Home Remedies for Dry Cough: కోవిడ్-19 సోకిన వారిలో ప్రాథమికంగా దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి.

Update: 2021-05-01 08:21 GMT

Representational Image

Dry Cough: అసలే కరోనా కాలం. ఏ దగ్గు ఏ అనారోగ్యాన్ని సూచిస్తుందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. చిన్నపాటి దగ్గు వచ్చినా సరే చుట్టుపక్కల వారు భయపడుతున్నారు. అయితే ఇలా 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు ఉంటే వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహాలు పాటించాలి. మిగితా వారితో భౌతిక దూరాన్ని పాటించాలి. ముఖ్యంగా మాస్క్ ధరించాలి. అనవసరంగా బయటికి వెళ్లకపోవడం మంచిది. అయితే వైద్యుల సలహాతో పాటు ఇంటి వైద్యం కూడా పాటిస్తూ ఉపశమనం పొందవచ్చు. అవేంటో మన "లైఫ్ స్టైల్లో చూద్దాం.

కోవిడ్-19 సోకిన వారిలో ప్రాథమికంగా దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాదు వారికి ఒళ్లు నొప్పులు, అలసట, గొంతు నొప్పి, తలనొప్పి కూడా ఉంటుంది. మొదట్లో పొడి దగ్గు ఉంటుంది. కానీ కొంత మందికి కఫంతో కూడిన దగ్గు కూడా ఉండొచ్చు. ఈ లక్షణాలున్నప్పుడు చికిత్సలో భాగంగా వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోమంటారు. ఎక్కువగా పోషక విలువలున్న ద్రవ పదార్థాలు ఇస్తారు. అలాగే నొప్పుల నివారణకు పారాసెటమాల్ ఇస్తారు. దీంతో దగ్గు కొద్ది రోజులు కొనసాగినప్పటికీ వారం రోజుల్లోపే జ్వరం తగ్గుతుంది. డబ్ల్యూహెచ్ఓ చైనాలో జరిపిన అధ్యయనం ప్రకారం బాధితులు తిరిగి కోలుకునేందు కనీసం 2 వారాల సమయం పడుతుంది.

శుభ్రమైన నీటి తాగుతూ వుండాలి. ఎక్కువగా ఫ్రిజ్ వాటర్, శీతల పానియాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. రెగ్యులర్ గా గోరు వెచ్చని నీటి తీసుకుంటూ వుంటే ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి వాటిని నోటిలో పోసుకుని గార్లిక్ చేస్తూ వుండాలి.

దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటే రోజూ ఉదయాన్నే రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తిప్పతీగ రసం రోగనిరోధకశక్తిని పెంచుతుంది, మూడు దోషాలైన – వాత, పిత్త, కఫాల మధ్య సమన్వయం తెస్తుంది.

రాత్రి నిద్రించడానికి ముందు నోట్లో ఏలకుల ను ఉంచండి. ఏలకులు తనను తాను కరిగించి, గొంతులోకి రసాన్ని నింపుతుంది. ఇది ఉత్తమ ఔషధం. దగ్గు నుండి ఉపశమనం కోసం ఒక కప్పు ద్రాక్ష రసం నిత్యం తీసుకోవాలి.

శ్వాసకోశ వ్యవస్థ అంటువ్యాధులను నివారించడానికి మద్యం మరియు ధూమపానాన్ని విస్మరించండి. మీ గొంతు క్లియర్ కావడానికి రోజుకు రెండుసార్లు అర టీస్పూన్ పసుపుతో ఒక కప్పు పాలు తాగాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి తాగినా దగ్గు తగ్గుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్ A, C రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేడి వేడి మసాలా టీ తాగినా దగ్గు తగ్గుతుంది.

దగ్గు ఇబ్బంది పెడుతున్నట్లైతే ఓ టేబుల్ స్పూన్ వెన్నలో వెల్లుల్లి రెబ్బల్ని ముద్దగా చేసుకుని తీసుకోవాలి. ఘాటుగా వున్నప్పటికీ వాటర్ ద్వారా గొంతులోకి జారవిడుకోవాలి. ఆ తర్వాత అరగంటపాటూ నీరు తాగొద్దు. ఇలా రోజూ చేస్తే, గొంతులో గరగర నుండి ఉపశమనం కలుగుతుంది.

మీ చుట్టూ దుమ్ము, దూళి, పొగ లాంటివి ఎక్కువగా ఉంటే, భోజనం తర్వాత కొద్దిగా బెల్లం ముక్క తినండి. ఇది మీ బ్లడ్‌ను క్లీన్ చేస్తుంది. ఇది పొల్యూషన్‌తో వచ్చే అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.

పొడి దగ్గు వస్తూ కఫం కూడా ఉంటే నల్ల మిరియాలు, తేనెకు తోడు అల్లం కుడా కలపి తీసుకుంటే గొంతును సరిచేస్తాయి. వెంటనే రిలీఫ్ వస్తుంది. మన ఇంట్లో పెద్ద వాళ్లు వుంటే వారి వద్ద బోలెడు చిట్కాలు వుంటాయి.

ఏది ఏమైనా ఈ చిట్కాలు పాటిస్తూ దగ్గు తగ్గకపోతే 24 గంటల తర్వాత డాక్టర్ని సంప్రదించాలిసందే.

Tags:    

Similar News