రోజూ వేరుశెనగ పల్లీలు తీసుకుంటే..!

రోజూ వేరుశెనగ పల్లీలు తీసుకుంటే..!రోజూ వేరుశెనగ పల్లీలు తీసుకుంటే..!

Update: 2019-09-17 05:29 GMT

రోజూ కొన్ని వేరుశెనగ పల్లీలు తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, జింక్, బోరాన్‌ లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఆనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ప్రాణాంతక వ్యాధులైన కేన్సర్, గుండె జబ్బులు వంటి సమస్యలు రాకుండా వేరుశెనగలు సహాయపడతాయి అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

వేరుశనగలోని ఇనుము రక్తహీనతను నివారించి హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పల్లీలతో పాటు దీని నుంచి తీసిన నూనె కూడా చాలా మంచిదంటున్నారు నిపుణులు. వేరుశెనగను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్‌ ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి అంటున్నారు.

వేరుశనగలో ఓలిక్ యాసిడ్ ఉండటం వల్ల చెడు కోలెస్ర్టాల్ ను తోలగించి మనకు అవసరమైన కోలెస్ర్టాల్ ను పెంచి గుండెజబ్బులు రాకుండా చేస్తుంది. వేరుశనగలో ప్రోటీన్స్,యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లలో సరైన ఎదుగుదలకు సహయపడుతుంది. ఫోలిక్,యాంటి ఆక్సిడెంట్లు కడుపులో వచ్చే క్యానర్స్, ప్రేగు క్యాన్సర్ ను నివారిస్తాయి.

అయితే వేరుశనగను మితంగానే తినాలి లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి అంటున్నారు నిపుణులు.ఇవి భూమి లోపల పండిస్తారు కాబట్టి రసాయనాలు, పురుగుమందులు ఎక్కువుగా ఉపయోగిస్తారు వీటి వల్ల కోన్ని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్యులు సూచించిన మేరకు మాత్రమే వేరుశనగలను తినటం మంచిదంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News