Beer vs Whisky: బీరు లేదా విస్కీ.. ఏది ఆరోగ్యానికి మంచిది?

Beer vs Whisky: ఆల్కహాల్‌లో రకరకాలు ఉంటాయి. వీటిలో మద్యం ప్రియులు ఎక్కువగా బీరు, విస్కీలను ఇష్టపడతారు.

Update: 2025-05-20 17:11 GMT

Beer vs Whisky:: బీరు లేదా విస్కీ.. ఏది ఆరోగ్యానికి మంచిది?

Beer vs Whisky: ఆల్కహాల్‌లో రకరకాలు ఉంటాయి. వీటిలో మద్యం ప్రియులు ఎక్కువగా బీరు, విస్కీలను ఇష్టపడతారు. మద్యానికి బానిసలైన వ్యక్తులు అనేక రకాల బ్రాండ్లు, రుచులను రుచి చూస్తారు. కానీ చాలా మంది ఆల్కహాల్ ప్రియులు బీరును ఇష్టపడతారు. ఇంకొంతమంది విస్కీ మంచిదని అంటారు. అయితే, బీరు లేదా విస్కీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ప్రయోజనంగా ఉంటుందో తెలుసుకుందాం..

బీర్

బీరులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా, పాలీఫెనాల్స్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎక్కువ మొత్తంలో బీరు తాగడం వల్ల ఇది ఊపిరితిత్తులపై ఒత్తిడిని కలిగిస్తుంది. బీరు సిలికాన్ కు మూలం, ఇది ఎముకల బలాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా, ఉబ్బరం కూడా వస్తుంది.




విస్కీ

విస్కీలో 40% లేదా అంతకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. విస్కీలో కార్బోహైడ్రేట్లు, చక్కెర తక్కువగా ఉంటాయి. 30 మి.లీ. షాట్‌లో దాదాపు 70 కేలరీలు ఉంటాయి. ఇందులో ఎలాజిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. అంతేకాకుండా, ఇందులో కార్బోహైడ్రేట్లు ఉండవు. ఇది కొంతమందికి జీర్ణం కావడాన్ని సులభతరం చేస్తుంది.




 


బీరు లేదా విస్కీ, ఏది ఆరోగ్యకరమైనది?

* నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ బరువును నియంత్రించుకోవాలనుకుంటే కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే విస్కీని తాగవచ్చు.

* ఈ రెండు పానీయాలు గుండె ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. కానీ, విస్కీలోని యాంటీఆక్సిడెంట్లు అదనపు రక్షణను అందిస్తాయి.

* ఈ రెండూ మితంగా తీసుకుంటే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఎక్కువగా తీసుకుంటే హానికరం కావచ్చు.




Tags:    

Similar News