Banana Peel: అరటి పండు తొక్కతో జిడ్డు చర్మానికి చెక్

Banana Peel: జిడ్డు చర్మం వున్న వారికి అరిటిపండు తొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం..

Update: 2021-02-23 06:41 GMT

అరటిపండు తొక్కతో ప్రయోజనాలు (ఫోటో:పిక్సేబి)

సాధారణంగా అందరికీ తెలిసిన పండు అరటి పండు. అరటి పండులో ఎన్ని పోషక విలువలు ఉన్నయో అరటి తొక్కలో కూడా అంతే పోషకాలు వున్నాయని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అరటిపండును మనం ఎంత ఇష్టంగా వెంటనే తింటామో , అరటి పండు తొక్కను కూడా అలానే వెంటనే పారేస్తాము .అయితే అరటి పండు మాత్రమే కాదు, అరటి పండు తొక్క కూడా మనకు మేలు చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే.అరటి పండు తొక్కను కూడా మనం తినవచ్చు తెలుసా..! సైంటిస్టులు చేసిన ప్రయోగాలు అరటి పండు తొక్క తినడం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాయి. అవేంటో  హెచ్ ఎం టి వి లైఫ్ స్టైల్ లో చూద్దాం

  • కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము ధూళి, తీసుకునే ఆహారం.. ఇవన్నీ మన చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాంతో చర్మం నల్లగా మారుతుంది. అయితే మనం వృధాగా పడేసే అరటి పండు తొక్క ఈ సమస్యలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది. జిడ్డు చర్మం వున్న వారు చెంచా తేనె, నిమ్మరసం, ఒక అరటి తొక్కను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి కాసేపాగి గోరువెచ్చనితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంలో అధిక జిడ్డు వదులుతుంది.
  • అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను వుంచడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
  • మొటిమలతో బాధపడే వారు అరటి తొక్కతో ముఖాన్ని 5 నిమిషాలు మర్థన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల ఒక వారంలోపలే మంచి ఫలితం కనపడుతుంది.
  • సోరియాసిస్ తో బాధపడుతున్న వారు అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు. దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్క తో మసాజ్ చేయండి.
  • యూవి కిరణాల నుండి రక్షణ: అరటి తొక్క హానికరమైన యూవీ కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు మీ కళ్ళను అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచండి. ఇలా చేయటం వలన మీ కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.
  • అరటి పండులోని తొక్కలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి .. దీనిని తినడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతంది. ఒకవేళ తొక్కని పూర్తిగా తినకపోయినా.. అందులోని తెల్లని పదార్థాన్ని స్పూన్‌తో తీసుకోవచ్చు.
  • అరటి పండు తొక్కలోట్రిప్టోఫాన్ అనే రసాయనం నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి పండు తొక్కలను తింటుంటే ప్రయోజనం ఉంటుంది.
  • అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.ఇది శరీరంలో ఉన్న ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు. ఓ పరిశోధక బృందం దీన్ని నిరూపించింది కూడా. వరుసగా కొన్ని రోజుల పాటు కొంత మంది రోజూ అరటి పండు తొక్కలను తిన్నారు.దీంతో వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు.
  • అరటి పండు తొక్క మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది.శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • అరటి పండు తొక్కను రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.గ్యాస్, అసిడిటీ,మలబద్దకం ఉండదు.శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.
  • అరటి పండు తొక్కను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది.ఇది దృష్టి సమస్యలను పోగొడుతుంది.రేచీకటి, శుక్లాలు రావు. దెబ్బలు,గాయాలు, పుండ్లు,దురదలు, పురుగులు,కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది.
  • అరటి పండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా,తెల్లగా మారుతాయి.చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి.
  • అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు.లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు.దీంతో పైన చెప్పిన అన్ని లాభాలు కలుగుతాయి.
Tags:    

Similar News