Whats App: మీ వాట్సాప్ నెంబర్‌కి ఈ మెస్సేజ్‌ వచ్చిందా..! చెక్ చేయండి లేదంటే..?

Whats App: మీ వాట్సాప్ నెంబర్‌కి ఈ మెస్సేజ్‌ వచ్చిందా..! చెక్ చేయండి లేదంటే..?

Update: 2022-01-30 09:15 GMT

Whats App: మీ వాట్సాప్ నెంబర్‌కి ఈ మెస్సేజ్‌ వచ్చిందా..! చెక్ చేయండి లేదంటే..?

Whats App: దేశంలో టెక్నాలజీ ఎంతగా పెరుగుతుందో అంతే మొత్తంలో సైబర్ దాడులు కూడా పెరుగుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. నిమిషాల్లో పని ముగిస్తున్నారు. టార్గెట్‌ వ్యక్తులను మాటలతో బురడి కొట్టించి డబ్బు కాజేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌లో ఓ మెస్సేజ్ చక్కర్లు కొడుతుంది. మీరు 50 లక్షల లాటరీ గెలిచారని వాయిస్ మెస్సేజ్, టెక్ట్స్‌ మెస్సేజ్ పంపుతున్నారు. మీకు డబ్బు కావాలంటే వాట్సాప్‌ కాల్ చేయమని చెప్పి వివరాలను తెలుసుకుంటున్నారు. మీకు ఇలాంటి మెస్సేజ్‌లు ఏమైనా వస్తే వాటిని నమ్మవద్దు. వాటిని వెంటనే డిలీట్ లేదా బ్లాక్ చేయాలి. 

వాయిస్‌ మెస్సేజ్‌లో సైబర్‌ నేరస్థుడు తనను తాను కేబీసీ కస్టమర్ ఆఫీసర్‌గా చెప్పుకుంటున్నాడు. తన పేరు రాకేశ్‌ శర్మ అని ముంబై నుంచి మాట్లాడుతున్నట్లుగా పరిచయం చేసుకుంటాడు. మీ నెంబర్‌కి కేబీసీ నుంచి రూ.25 లక్షల లాటరీ వచ్చినట్లు నమ్మబలుకుతాడు. తమ సంస్థ నిర్వహించిన ఈ పోటీలో 5 వేల మంది మొబైల్ నంబర్లలో లాటరీ తీస్తే మీ నెంబర్‌ వచ్చిందని చెబుతాడు. మీకు డబ్బుకావాలంటే వాట్సాప్‌ కాల్ చేయమని అడుగుతాడు. విషయం ఏంటంటే ఇదే మెస్సేజ్ చాలా మందికి వస్తున్నాయి. అందరితో ఇదే చెబుతున్నాడు. 

ఆ వాయిస్‌ మెస్సేజ్‌లో 25 లక్షల మొత్తాన్ని ఎలా పొందాలో వివరంగా చెప్పేందుకు ఆ వ్యక్తి ట్రై చేస్తాడు. ఆడియో మెసేజ్‌లోని చిత్రంలో మేనేజర్ నంబర్, లాటరీ నంబర్‌లు ఉన్నాయని మీ మొబైల్ ఫోన్‌లో ఆ నెంబర్ సేవ్ చేసి దాని ద్వారా వాట్సాప్ కాల్ చేయాలని కోరుతాడు. సాధారణ కాల్ చేస్తే మేనేజర్ ను కాంటాక్ట్ చేయడం కుదరదని చెబుతాడు. వాట్సాప్‌కు కాల్ చేసిన తర్వాత, మేనేజర్ మీకు లాటరీకి సంబంధించిన మిగతా సమాచారాన్ని చెబుతాడని నమ్మిస్తాడు. ఇలా  తెలియని నంబర్ నుంచి ఆడియో సందేశం వస్తే అస్సలు నమ్మకండి. ముందుగా ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Tags:    

Similar News